ఎదురులేని పెద్దరికం చెలాయిస్తున్న పెద్దిరెడ్డికి అమిత్ షా టెన్షన్ పట్టుకుంది. ఏ పార్టీ అయినా కానీ, అవినీతిని ప్రశ్నిస్తే చితక్కొట్టించే పెద్దాయనకే అనుకోకుండా పెద్ద కష్టం వచ్చింది. 16 వేల ఓట్లొచ్చిన బీసీయే కదా అని దాడి చేయిస్తే..ఈ బీసీ పోయి అమిత్ షా దగ్గర పంచాయతీ పెట్టాడు. ఏం చేయాలో తెలియక పెద్దిరెడ్డి సతమతమవుతున్నాడు. ఏపీలో ప్రశ్నిస్తే ప్రజలైనా ప్రతిపక్ష నేతలైనా ప్రభుత్వ దా-డు-లు ఎదుర్కోక తప్పదు. ఈ అరాచకం మోతాదు పెద్దాయనగా పిలవబడే పెద్దిరెడ్డి నియోజకవర్గం పుంగనూరు, తమ్ముడు నియోజకవర్గం తంబళ్లపల్లెలో మరీ ఘోరంగా ఉంటుంది. మద్యం రేట్లు దారుణమని సోషల్మీడియాలో పోస్టు పెట్టిన ఓంప్రతాప్ తెల్లారేసరికి శ-వం అయ్యాడు. దౌర్జన్యాలను ప్రశ్నించిన జడ్జి రామకృష్ణపై హ-త్యా-యత్నం చేశారు. ఈ దా-డు-లపై వార్తలు రాసిన విలేకరిపై దా-డు-ల-కు పాల్పడింది గ్యాంగ్. ఇంతటి అరాచకుడు విపక్ష నేతలని వదలడంలేదు. గత ఎన్నికల్లో పోటీచేసిన జనసేన అభ్యర్థి రామచంద్రయాదవ్ చాలా రోజులుగా నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. ఇటీవల కొత్త ఇల్లు కట్టుకుని గృహప్రవేశం చేస్తే పెద్దిరెడ్డి మనుషులు ఇంటిని, వాహనాలను ధ్వంసం చేశారు. రైతుల సమస్యలపై చర్చించేందుకు సమావేశం పెట్టిన రామచంద్రయాదవ్ పై దా-డు-ల-కు పాల్పడ్డారు. స్థానికంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదు. పైగా పెద్దిరెడ్డి ప్రోద్బలంతో రివర్స్ కేసులు బనాయించారు. కొన్నివారాల పాటు మౌనంగా ఉన్న రామచంద్రయాదవ్ హఠాత్తుగా అమిత్ షాతో భేటీ అయ్యాడు.
తనపై, తన కుటుంబ సభ్యులపై అనుచరులతో మంత్రి పెద్దిరెడ్డి దా-డి చేయించారని షాకి ఫిర్యాదు చేసినట్టు మీడియాకి ప్రకటన విడుదల చేశారు. తనపై దాడి గురించి ఇచ్చిన ఫిర్యాదుపై ఇప్పటివరకు పోలీసులు ఎవరిపై చర్యలు తీసుకోలేదని, మంత్రి పెద్దిరెడ్డిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదని ఆరోపించారు. ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయని హైకోర్టు ఆర్డర్ ఇచ్చినా సభ పెట్టుకోనివ్వలేదని, గత నెల రైతుభేరి సభ జరగకుండా అడ్డుకున్నారని అమిత్ షాకి ఫిర్యాదు చేశారు. ఇంటిపై దా-డి, నా కుటుంబాన్ని హతమార్చేందుకు ప్రయత్నించారని రామచంద్రయాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఘటనపై విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని, తనకు భద్రత కల్పిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారని రామచంద్రయాదవ్ తెలిపారు. ఈ విషయాలు మీడియాలో ప్రముఖంగా రావడంతో పెద్దిరెడ్డిలో టెన్షన్ మొదలైంది. తనకో,సీఎంకో అమిత్ షా అపాయింట్మెంట్ అసాధ్యం అయితే, రామచంద్రయాదవ్ కి ఎలా దొరికిందనేది పెద్దిరెడ్డికి అంతుబట్టటంలేదు.