మా జగన్ మోహన్ రెడ్డి చూసారా, చీఫ్ సెక్రటరీని సుబ్బు అన్నా, డీజీపీని గౌతం అన్నా అంటూ ఎలా పిలుస్తున్నారో ? అధికారులతో ఇలా ఉండాలి, మీ చంద్రబాబుకి చెప్పండి అంటూ, మొన్నా మధ్య వైసీపీ నేతలు చేసిన హంగామా చూసాం. అయితే జగన్ అలా ఉంటున్నారో లేదో మనం చూడాలేదు కాని, వైసీపీ నేతలు మాత్రం, అధికారులకు చుక్కలు చూపిస్తున్నారు. సీనియర్ మంత్రులు సైతం ఇలా చేస్తూ ఉండటంతో, ఇది జగన్ కు తలనొప్పి అనే చెప్పాలి. తాజాగా సీనియర్ మంత్రి అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరు జిల్లా సమీక్షలో, ఆయన అధికారులతో ప్రవర్తించిన తీరు చర్చనీయంసం అయ్యింది. అసెంబ్లీలో ఎంతో కూల్ గా కనిపించిన పెద్దిరెడ్డి, ఇలాంటి హెచ్చరికలు కూడా చేస్తారా ? సీనియర్ అయిన, ఆయనకు, అధికారులతో ఎలా ప్రవర్తించాలో తేలియదా అంటూ విమర్శలు వస్తున్నాయి.
చిత్తూరు జిల్లా సమీక్షా సమావేశంలో, పెద్ది రెడ్డి అధికారుల పై తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ప్రభుత్వం మారింది, మీరు మారాలి, అయినా మీరు మారలా, మీ తీరు కూడా మారలా, పధ్ధతి మార్చుకోండి, లేకపోతే మిమ్మల్ని ఇక్కడ నుంచి పంపించటం నాకు నిమిషం పని అంటూ పెద్ది రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చివరకు అధికారులను కూడా ఏకవచనంతో సభోదించటం పై, అధికారులు తీవ్ర అసహనం వ్యక్తం చేసారు. అక్కడే ఉన్న మరో మంత్రి నారాయణ స్వామి ముందుగా మాట్లాడుతూ, అధికారులను గౌరవంగా సంభోదించినా, పెద్దిరెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం పై, అధికారులు ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా ఆడవారి పై కూడా మంత్రి అలాగే మాట్లాడటం చర్చనీయంసం అయ్యింది. ఉద్యానవన శాఖ జేడీ సరస్వతి ఆమె శాఖ పై నివేదిక ఇస్తున్నారు.
దీంతో మధ్యంలో కల్పించుకున్న పెద్ది రెడ్డి, నీ శాఖలో చాలా జరిగింది, ఎన్నో సార్లు ఫోన్లో హెచ్చరించినా నువ్వు మారలా, ఇప్పటికైనా మారు, లేకపోతే నిన్ను ఇక్కడ నుంచి పంపించటం నిమిషం పని అని అన్నారు. ఆమె వివరణ ఇవ్వబోగా, కూర్చో కూర్చో అంటూ పెద్ది రెడ్డి అన్నారు. తరువాత, పీఎంఐపీ పీడీ విద్యాసాగర్ పై కూడా పెద్ది రెడ్డి ఫైర్ అయ్యారు. మీ తీరు బాగూలేదు, అంటూ ఫైర్ అయ్యారు. ఆయన వివరణ ఇచ్చేందుకు ప్రయత్నం చెయ్యగా, నీ వివరణ నాకు అవసరం లేదు కూర్చో అని గట్టిగా అరిసారు. అగ్రికల్చర్ జేడీ విజయ్‌కుమార్ కూడా ఇలాగే అరిసారు, నీ సోదంతా నాకొద్దని చెప్పారు. తరువాత పెద్ది రెడ్డి అందరికీ కలిపి వార్నింగ్ ఇచ్చారు. కలెక్టర్‌తో సహా అందరు అధికారులు వినండి, మా ఎమ్మెల్యేలు, నాయకులు మీ వద్దకు వచ్చి ఏదైనా సమస్య చెప్పితే వెంటనే పరిష్కరించండి అని స్పష్టం చేసారు. అయితే ఇంత మంది సీనియర్ అధికారులు ఏదైనా తప్పు చేస్తే, వారిని పర్సనల్ గా పిలిచి చెప్పాలి కాని, ఇలా అందరి ముందు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఏంటి అని విమర్శలు వినిపిస్తున్నాయి.