పెగాసిస్ పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతి ప్రచారం చేసి అడ్డంగా దొరికిపోయింది. వైసీపీ చేసిన అతి ప్రచారం , వాళ్ళు చేసింది ఫేక్ అని, తెలుగుదేశం పార్టీ ఆధారాలతో సహా నిరూపించటంతో, ఇప్పుడు వైసీపీ అడ్డంగా ఇరుక్కుంది. దీంతో ఒక రోజులునే, పెగాసిస్ పైన వైసీపీ సైలెంట్ అయిపొయింది. ముఖ్యంగా పెగాసిస్ పైన తెలుగుదేశం పార్టీ, 8 ఆధారాలు బయట పెట్టింది. అందులో మొదటిది ఆర్టిఐ రిపోర్ట్. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో, జగన్ కు అత్యంత ప్రీతి పాత్రుడు గౌతం సవాంగ్ గారే, అసలు ఇప్పటి వరకు తాము పెగాసిస్ అనే సాఫ్ట్వేర్ కొనలేదు కొనలేదు కొనలేదు అంటూ కుండ బద్దలు కొడుతూ ఇచ్చిన ఆర్టిఐ రిప్లై. దీనికి మించిన తిరుగులేని ఆయుధం మరొకటి లేదు. ఇక రెండో అతి ముఖ్యమైన అంశం, ఎన్నికల ముందు వైవీ సుబ్బా రెడ్డి నా ఫోన్ ని చంద్రబాబు ట్యాప్ చేస్తున్నారని ఢిల్లీ హైకోర్టులో కేసు వేసారు, తరువాత ఎన్నికల్లో గెలవగానే కేసు వెనక్కు తీసుకున్నారు, ఇలా ఎందుకు చేసారని టిడిపి ప్రశ్నిస్తుంది. ఇక మూడో అంశం సజ్జల రామకృష్ణా రెడ్డి ఫోన్ ట్యాప్ అయ్యిందని ఎన్నికల ముందు అమరావతి హైకోర్టులో కేసు వేసారు, ఆ కేసు విచారణకు ఒక్కసారి కూడా వెళ్ళలేదు. దీంతో, మీకు ఈ కేసు పై ఇంట్రెస్ట్ లేకపోతే మాకెందుకు అని, హైకోర్టు కేసు కొట్టేసింది.
ఇక నాలుగో అంశం, మమతా బెనర్జీ అన్నట్టు వైసిపీ ప్రచారం చేస్తుంది. అయితే ఎక్కడా కూడా మమతా బెనర్జీ ఆ వ్యాఖ్యలు చేసిన రికార్డు లేదు. కేవలం గాలి వార్తలు ఆధారంగా వైసీపీ ఇంత హడావిడి చేస్తుంది. ఇక మరో అంశం, ఈ పెగాసిస్ పైన పిచ్చ కధనాలు అన్నీ సోషల్ మీడియాలో రాసి, అవి డబ్బులు పెట్టి మరీ ప్రోమోట్ చేస్తున్నారు వైసీపీ నేతలు. డబ్బులు పెట్టి ఎందుకు ప్రోమోట్ చేస్తున్నారు అనేది ఇక్కడ ఆలోచించాల్సిన అంశం. మరో అంశం పెగాసిస్ పైన అసలు పార్లమెంట్ లో లేవనెత్తాల్సిన అవసరం లేదని విజయసాయి రెడ్డి చెప్పటం, ఢిల్లీలో వద్దు అంటే, ఇక్కడ మాత్రం గోల చేయాలి అంట. ఎందుకో మరి ? ఇక చివరి అంశం, ఈ పెగాసిస్ తయారు చేసిన NSO సంస్థ, ఇది కేవలం ప్రభుత్వాలకు మాత్రమే ఇచ్చే సాఫ్ట్వేర్ అని, ఎక్కడా ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వం అని తేల్చి చెప్పారు. ప్రభుత్వానికి ఇచ్చి ఉంటే రికార్డు ఉంటుంది కదా ? ఒక్క మమతా బెనర్జీ చెప్పింది అంటూ, ఎక్కడో వచ్చిన గాలి వార్త పట్టుకుని, ఇన్ని ఆధారాలు ఉన్నా సరే, వైసీపీ ఎంత గట్టిగా ఫేక్ చేసిందో అర్ధం అవుతుంది.