గడప గడప కార్యక్రమంలో భాగంగా రోజుకొక వైసిపి నాయకుడికి చేదు అనుభవం ఎదురవుతుంది. ప్రజల్లో ప్రభుత్వం పై వ్యతిరేఖత  రోజురోజుకి ఎక్కువ అవడంతో, తమ ఇంటికి వస్తున్న వైసిపి నాయకులపై  ప్రజలు తిరగబడుతున్నారు. అయితే ఈ రోజు  పెందుర్తిలో వైసిపి  ఎమ్మెల్యేకు ప్రజలు చుక్కలు చూపించారు. గడపగడపకు కార్యక్రమంలో భాగంగా ఇంటికి వచ్చిన  ఎమ్మెల్యేపై  కాలనీ వాసులు తిరగబడ్డారు. ఆర్.ఆర్.వెంకటాపురం గ్రామంలో ఈ ఘటన జరిగింది. తమ  ఇళ్లపై ఉన్న హెచ్.టీ లైన్ తొలగించాలని  స్థానికులు డిమాండ్ చేసారు. దాంతో ఎమ్మెల్యే అనుచరుడు ఆదిరెడ్డి మురళి హెచ్.టీ లైన్  ఎందుకు ,ఏ కంగా మీ ఇళ్లనేతొలగిస్తాం అనడం తో  ఒక్కసారిగా కోపోద్రిక్తులై , ఎమ్మెల్యేను ,ఆయన అనుచరుడిని వాయించి పడేసారు. దీంతో ఎమ్మెల్యే అక్కడ నుంచి జారుకున్నారు...

Advertisements

Advertisements

Latest Articles

Most Read