జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పెన్షన్ దారులకు షాక్ ఇచ్చే కార్యక్రమం చేపట్టింది. పెన్షన్ లబ్దిదారుల విషయంలో, జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తెసుకుంటూ, ఉత్తర్వులు ఇచ్చింది. రాష్ట్రంలో లబ్దిదారులు కాని వారు కూడా, పెన్షన్ తీసుకుంటున్నారని, అలాంటి వారిని ఏరి పారేయటానికి, ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం చెప్తుంది. బోగస్ పెన్షన్ దారులు ఎక్కువగా ఉన్నారని, తమకు వస్తున్న ఫిర్యాదులు ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం చెప్తుంది. ముఖ్యంగా కుల వృత్తుల పెన్షన్ లు, మెడికల్ కారణాలు చెప్పి పెన్షన్ తీసుకునే వారి విషయంలో, ఒంటరి మహిళల పెన్షన్ లో నిజమైన లబ్దిదారులను గుర్తించాలని ఆదేశాలు ఇచ్చింది. దీనికి సంబంధించి కొత్త నిబంధనలు ఇస్తూ, ఉత్తర్వులు ఇచ్చింది. ఇక నుంచి పెన్షన్ పొందాలి అంటే, కుల వృత్తి వారి జీవనాధారం అయి ఉండాలని స్పష్టం చేసింది. దీనికి అవసరమైన పత్రాలు అన్నీ, ఎక్సైజ్‌, సాంఘిక సంక్షేమ శాఖ, చేనేత, జౌళిశాఖ, మత్స్యశాఖ, వైద్యశాఖలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక వాలంటీర్ల సహాయంతో, ఈ దరఖాస్తులు పరిశీలించి, ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకోనున్నారు. ఈ ప్రక్రియ 21 రోజుల్లో తీసుకోవాలని నిర్ణయం చేసింది. అయితే ఈ నిర్ణయంతో, నిజమైన లబ్దిదారులు కూడా నష్టపోయే అవకాసం ఉందని, ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read