ఇది వరకు పెన్షన్లు అంటే పెద్దగా పెట్టించుకునేవారు కాదు. కాంగ్రెస్ హయంలో కేవలం 200 రూపాయలు ఇచ్చే వారు. వాటితో ఏమి చేసుకోలేని పరిస్థితి. ఈ నేపధ్యంలో, పాదయాత్రలో వారి కష్టాలు చూసిన చంద్రబాబు, అధికారంలోకి రాగానే అయుదు రెట్లు పెంచి, వెయ్య రూపాయలు చేసారు. దీంతో ముసలి అవ్వలకు, తాతలకు పెన్షన్లు భరోసా ఇచ్చాయి. ఇక చంద్రబాబు వీటిని వెయ్యి నుంచి, రెండు వేలుకు పెంచారు. దీంతో వీరి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ముసలి వయసులో వదిలేసిన, కొడుకులు, కోడళ్ళు కూడా వారిని తెచ్చి ఇంట్లో పెట్టుకున్న పరిస్థితి. అయితే ఎన్నికల ప్రాచారంలో చంద్రబాబు, జగన్ ఇద్దరూ , పెన్షన్ 3 వేలు చేస్తామని చెప్పారు. ప్రజలు చంద్రబాబుని ఓడించి, జగన్ కు అవకాసం ఇచ్చారు. కాని జగన్ మాత్రం, 3 వేలు కాకుండా 250 పెంచి, 2250 చేసారు. 3 వేలకు పెంచుకుంటూ పోతాం అని ప్రకటించారు.

అయితే పెంచిన 250 పోయిన నెల ఇవ్వలేదు. ఈ నెల నుంచి ఇస్తునట్టు ప్రకటించారు. ప్రతి నెల లాగే, హుషారుగా పెన్షన్ తీసుకోవటానికి వెళ్ళిన వృద్ధులకు, వికలాంగులకు షాక్ తగిలింది. పెన్షన్లు ఈ రోజు ఇవ్వటం లేదని, ఈ నెల కొంచెం ఆలస్యంగా, 8 వ తారీఖు ఇస్తామని చెప్పారు. చంద్రబాబు ఉండగా, జీతాలు ఇచ్చినట్టు ఒకటవ తారీకు పెన్షన్ ఇస్తూ ఉండటంతో, ఎంతో మంది మందులకు, ఇతర ఖర్చులకు, మొదటి వారంలోనే ఖర్చు పెట్టే వారు. అయితే మొదటి సారి, పెన్షన్లు వారం లేట్ గా వస్తున్నాయి అని తెలుసుకుని, ఉసూరు మంటూ వెనుతిరిగి ఇళ్ళకు వెళ్లారు. అసలు ఎందుకు లేట్ గా ఇస్తున్నారు అయ్యా, అని కొంత మంది వృద్ధులు అడగగా, ఆ సమాధానం విని, వీరు అవాక్కయ్యారు. 8 వ తారీఖు జగన్ తండ్రి రాజశేఖర్ రెడ్డి పుట్టిన రోజు అని, అందుకే ఆ రోజు నుంచి పెన్షన్ ఇస్తామని చెప్పటంతో, అవాక్కవ్వటం వీరు వంతు అయ్యింది. మందులు అవి కొనుక్కోవటానికి, మరో వారం రోజులు ఆగాలని, ఇలా పుట్టిన రోజులు, పోయిన రోజులు అని మా పొట్ట కొడితే ఎలా అని లబోదిబో మంటూ ఇంటికి వెళ్ళిపోయారు. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే, ఇక ఎవరైనా ఏమి చేయగలరు...

Advertisements

Advertisements

Latest Articles

Most Read