జగన్ మోహన్ రెడ్డి గారి క్యాబినెట్ లో, కొంత మందిని కొన్ని పనులకు మాత్రమే వాడేవారు. వాళ్ళ శాఖల్లో పనులు కంటే, వేరే పనులకే మంత్రులను ఉపయోగించుకునే వారు. మరి వీరి శాఖ సంగతి ఏంటి అనుకుంటున్నారా ? అన్ని శాఖలు చూసేది ఒకరే కాదా, ఆయన చూసుకునే వారు. మంత్రులను మాత్రం, రాజకీయాలకు మాత్రమే వాడుకునే వారు. కొడాలి నానిని కమ్మోళ్ళ మీదకు, పేర్ని నానిని కాపుల మీదకు వదిలేవారు. ఎప్పుడు చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టినా, లోకేష్ మాట్లాడినా, గంటలోపే కొడాలి నాని రంగంలోకి దిగి, ఉచ్చ నీచాలు మరిచి, అమ్మలక్కలు తిట్టి, విషయం ఏమి లేకుండా, కేవలం బూతులు తిట్టి, చెమటలు కక్కుకుంటూ ప్రెస్ మీట్ ముగించే వారు. ఇక పవన్ కళ్యాణ్ ఏమైనా మాట్లాడతే చాలు, మా కాపోడు అంటూ, డైరెక్ట్ గా కులం పేరు పెట్టి, పేర్ని నాని ప్రెస్ మీట్ పెట్టి, పవన్ కళ్యాణ్ పై విరుచుకు పడేవారు. కొడాలి నాని లాగా బూతులు లేకపోయినా, వెటకారంగా తీసి పడేసే వారు. మూడేళ్ళ పాటు, ఈ ఇద్దరు మంత్రుల ఉద్యోగాలు ఇవే. అయితే నాలుగు రోజుల క్రితం జరిగిన మంత్రి వర్గ మార్పుల్లో, పేర్ని నాని, కొడాలి నానిని, జగన్ మోహన్ రెడ్డి పీకి పడేసారు. ఏదో ఒక రోజు జగన్ మోహన్ రెడ్డి, ఇలా బూతులు తిట్టించి, వాడుకుని వదిలేస్తాడు అని అందరూ అనుకున్నట్టే జరిగింది.
వీరి బూతు స్థానాలకు ఎవరూ ఇప్పటి వరకు భర్తీ చేయలేదు. కొత్త మంత్రి వర్గం ప్రమాణ స్వీకారం అయ్యింది, కొంత మంది మంత్రులు చార్జ్ కూడా తీసుకున్నారు. అయితే, నిన్న పవన్ కళ్యాణ్ అనంతపురం జిల్లా పర్యటనకు వెళ్ళిన సంగతి తెలిసిందే. జగన్ మోహన్ రెడ్డి పాలనలో చనిపోయిన రైతుల కుటుంబాలను పవన్ కళ్యాణ్ పరామర్శించి, వారికి పార్టీ తరపున కొంత సాయం అందించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్, జగన్ పై విరుచుకు పడ్డారు. తనని చంద్రబాబు దత్త పుత్రుడు అంటే, జగన్ ని సిబిఐ దత్తపుత్రుడు అంటానని, తనని టిడిపి బి-టీం అంటే, మిమ్మల్ని చర్లపల్లి షటిల్ టీం అనాల్సి వస్తుంది అంటూ, ఘాటుగా స్పందించారు. అయితే పవన్ కళ్యాణ్ కు వైసీపీ వైపు నుంచి కౌంటర్ ఇచ్చే వాళ్ళే లేకుండా పోయారు. పేర్ని నాని ఉండి ఉంటే, గంటలోనే ప్రెస్ మీట్ పెట్టి విరుచుకు పడేవారు. ఇప్పుడు మంత్రి పదవి నుంచి పీకి పడేయటంతో, నాకు ఎందుకులే అని ఆయన మాట్లాడ లేదు. ఇక కొత్త మంత్రులలో కాపుల్లో అంబటి ఫేమస్. ఆయన ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ మాటల పై కౌంటర్ ఇవ్వలేదు. మొత్తానికి పేర్ని నాని లోటు అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎలా భర్తీ చేస్తారో మరి.