సాగు నీటి ద్వారానే కరువు నివారణ సాధ్య మవుతుందని తలిచారు ఆనాటి కమ్యూనిస్టు యోధులు. రైతు మనుగడ సాగిస్తేనే పల్లెలు కళకళలాడతాయి. తద్వార గ్రామాలు అభివృద్ధి చెందుతాయని భావించారు. అనంతపురంలో, పేరూరు వద్ద ప్రాజెక్టును నిర్మిస్తే వేలాది ఎకరాలలో బంగారు పంటలు పండుతాయని వారి ధృడసంకల్పం. అనుకున్నది సాధించడానికి నాటి యోధులు ఒకతాటి పై పోరాటం సాగించారు. కమ్యూనిస్టుల పిలుపు మేరకు పరిటాల శ్రీరాములుతో పాటు మరికొందరు ఒకతాటి పైకి వచ్చి రైతులతో కలిసి ఉద్యమబాట పట్టారు. 1942 నుంచి 1949 వరకు పోరాటాలు చేశారు. ఎట్టకేలకు ప్రభుత్వం దిగివచ్చి అప్పట్లో పేరూరు సమీపంలో అప్పర్ పెన్నార్ డ్యాం నిర్మించడానికి సమ్మతిం చింది. ఈ డ్యాం పరిధిలోని రామగిరి, కనగానపల్లి, కంబదూరు, రాప్తాడు, అనంతపురంరూరల్ మండలాల్లోని వేలాది ఎకరాలకు ప్రత్యక్షంగా పరోక్షంగా లబ్దిచేకూ రుతుందని అప్పట్లో ఆ పరిధిలోని రైతులు ఎంతో సంబరపడ్డారు. కాని అది వాస్తవ రూపం దాల్చలేదు.

peruru 01082018 2

దశాబ్దా లుగా నిరుప యోగంగా ఉన్న పేరూరు ప్రాజెక్టు పరిధిలోని రైతాంగం పూర్తిగా నిరాశ నిస్పృహలో ఉండింది. 2012లో అప్పటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబా బునాయుడు వస్తున్నా మీకోసం పాద యాత్రలో భాగంగా పేరూరు డ్యాం వద్ద బస చేయడంతోనే దానిలో కదలిక వచ్చిందని చెప్పవచ్చు. అక్కడ రైతులతో పాటు స్థానిక ఎమ్మెల్యే పరిటాల సునీత విన్నవిస్తూ ఆ ప్రాజెక్టు వల్ల కలిగే ప్రయోజనాలను సవివరంగా చెప్పారు. దీంతో ప్రభుత్వం రాగానే పేరూరు ప్రాజెక్ట్ కు నీరు తెప్పిస్తానని హామీ ఇచ్చారు. ఆ మేరకు 2015లో డీపీఆర్ కోసం రూ.1.50 కోట్లు మంజూరు చేసి సర్వే పూర్తీ చేయించారు. చివరికి రవీంద్ర వర్ధంతి సందర్భంగా రూ.804 కోట్లతో జీఓను విడుదల చేస్తామని ప్రకటించిన చంద్రబాబున, ఆ మేరకు హామీ నిలబెట్టుకున్నారు. ఇప్పుడీ పథకం పట్టాలెక్కే సమయం వచ్చింది. బుధవారం దీనికి భూమిపూజతో సీఎం శ్రీకారం చుడుతున్నారు.

peruru 01082018 3

ఈ పనులను ఏడాదిలో పూర్తి చేసేలా చూడనున్నారు. గుత్తేదారు సంస్థకు ఏడాది గడువు ఇచ్చారు. అయితే నాయకులు మాత్రం 8-9 నెలల్లో పూర్తయ్యేలా చూస్తామని చెబుతున్నారు. మరోవైపు ఈ పథకానికి మొత్తం 2,315 ఎకరాలు అవసరం. ఇందులో ప్రభుత్వ భూమి కాకుండా, మిగిలిన పట్టా, డీకేటీలను భూసేకరణ ద్వారా సేకరించే ప్రక్రియ ఆరంభించారు. అలాగే కాలువ, ఎత్తిపోతల పథకాలు, జలాశయానికి ఇప్పటికే ఇంజినీర్లు పెగ్‌మార్కింగ్‌ కూడా నిర్వహిస్తున్నారు. కాలువ తవ్వకం త్వరగానే జరుగుతుందనీ.. అయితే దీనిపై వంతెనలు, యూటీలు, అక్విడెక్ట్‌లు కలిపి 117 నిర్మించాల్సి ఉందనీ... వాటితోపాటు ఎత్తిపోతల పథకాల పనులు వేగంగా జరిగేలా చూస్తే, గడువులోపు పనులు పూర్తయ్యే వీలుందని ఇంజినీర్లు చెబుతున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read