12 ఓట్లతో గెలిచిన మంగళగిరి ఎమ్మెల్యే , అమరావతికి అన్ని విధాలుగా అడ్డు తగులుతున్న వైసీపీ‌ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డికి, హై కోర్ట్ మరో షాక్ ఇచ్చింది.

ప్రతి పేద వాడికి, విజ్ఞానం, వినోదం కూడా అందించాలి అనే లక్ష్యంతో, చంద్రబాబు ప్రభుత్వం ఫైబర్ నెట్ తో, 150 రుపాయిలకే, ఫోన్, టీవీ, ఇంటర్నెట్ ఇస్తుంటే, దాన్ని అడ్డుకుంటూ హై కోర్ట్ లో పిటీషన్‌ వేసాడు, ఈ వైసీపీ‌ ఎమ్మెల్యే.

ఫైబర్నెట్ ద్వారా టీవీ ఛానళ్ల ప్రసార రంగంలోకి అడుగిడకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోర్ట్ ని కోరగా, హై కోర్ట్ అది సమంజసం కాదని, ఆళ్ల రామకృష్ణా రెడ్డి పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ప్రభుత్వం, టెలివిజన్‌ రంగంలోకి అడుగు పెట్టవద్దని ఎక్కడ లేదని, ఉంటే చూపాలని చెప్పి, పిటీషన్‌ కొట్టేసింది.

150 రూపాయలు అంటే, పేదలు, దిగువ మధ్య తరగతి వారే ఎక్కువగా దీంతో లబ్ది పొందే అవకాసం ఉన్నా....ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, సాక్షి పేపర్, టీవీ స్థాపించిన చరిత్ర కలిగిన పార్టీ, ఇలా వ్యవహరించటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది...

Advertisements

Advertisements

Latest Articles

Most Read