2014కు ముందు, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన ప్రతి సారి, ఇప్పటి ప్రధాని, అప్పటి ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీ గారు చెప్పిన మాట, నేను అధికారంలోకి వచ్చేస్తున్నా, అచ్చే దిన్ వచ్చేస్తుంది, మీకు పెట్రోల్ అతి తక్కువ ధరకే ఇస్తాను అని.. కట్ చేస్తే, ఆయన నాలుగేళ్ళ పరిపాలనలో, పెట్రోల్ రేట్ లు ఆల్ టైం హై కు చేరుకున్నాయి.. కర్ణాటక ఎన్నికలు ముగిసే వరకు సైలెంట్‌గా ఉన్న పెట్రోలియం సంస్థలు.. ఒక్కసారిగా విరుచుపడుతున్నాయి...లీటర్ పెట్రోల్ ధర 80 రూపాయల మార్కును దాటేసింది. రోజూ వారీ ధరలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ధరల పెరుగుదల మరింత ఎక్కువైందని సామాన్యులు వాపోతున్నారు. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.80.76పైసలు ఉండగా, ముంబైలో అధ్యధికంగా రూ.84.07కి చేరింది. భోపాల్‌లో రూ.81.83, పాట్నాలో రూ.81.73, శ్రీనగర్‌లో రూ.80.35గా ఉంది.

modi 20052018 2

డీజిల్‌ ధర హైదరాబాద్‌లో రూ.73.45గా ఉండగా.. తిరువనంతపురం‌లో రూ.73.34, రాయ్‌పూర్‌లో రూ.72.96, గాంధీనగర్‌లో రూ. 72.63, భువనేశ్వర్‌లో రూ.72.43, పట్నాలో రూ.72.24, ముంబయిలో రూ. 71.94, కోల్‌కతాలో రూ.70.12, చెన్నైలో రూ.71.32గా ఉంది. పెట్రోల్‌ ధర తక్కువగా పనాజీలో రూ.70.26గా ఉండగా.. పోర్ట్‌బ్లెయర్(అండమాన్‌)‌లో డీజిల్‌ ధర తక్కువగా రూ.63.35గా నమోదైంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ధరలు పెరుగుతూనే ఉన్నాయి కానీ తగ్గిందేమీ లేదని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. 2014 నుంచి 2016 వరకు మొత్తం 9 సార్లు కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ పెంచింది. దీంతో లీటర్ పెట్రోల్‌పై అదనంగా రూ.11.70పైసలు, డీజిల్‌పై రూ.13.47పైసలు అదనపు భారం పడింది.

modi 20052018 3

ప్రస్తుత పెంపుతో పెట్రోల్‌ ధర జీవిత కాల గరిష్ఠానికి చేరింది. దిల్లీలో సెప్టెంబర్‌ 14, 2013లో పెట్రోల్‌ ధర రూ.76.06 ఉంది. ఇప్పుడు ఆ రికార్డును చెరిపివేస్తూ రూ.76.24కు చేరింది. మరోవైపు డీజిల్‌ ధరలు కూడా అదే దారిలో పయనిస్తున్నాయి. కర్ణాటక ఎన్నికల అనంతరం చమురు సంస్థలు గత ఏడు రోజులుగా వరుసగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచుతున్నాయి... మొత్తానికి, ప్రజలను అన్ని వైపుల నుంచి, చావ గొడుతుంది మోడీ ప్రభుత్వం... రోజూ వారీ ధరలు అంటూ ఒక తల తిక్క విధానం తీసుకువచ్చారు.. రోజు వారీ విధానంతో, అతి తక్కువ ధరల్లో పెట్రోల్, డీజిల్ లభిస్తుంది అని ప్రచారం చేసారు.. చివరకు ఆల్ టైం హై కు తీసుకువెళ్ళారు... మోడీ గారు చెప్పిన అచ్చే దిన్, ప్రజలకా ? గుజరాత్ కంపెనీలకా ? మనమే తప్పుగా అర్ధం చేసుకున్నామేమో...

Advertisements

Advertisements

Latest Articles

Most Read