ప్రతిపక్షంలో ఉండగా, జగన్ మోహన్ రెడ్డి, అప్పటి చంద్రబాబు పరిపాలన పై, పెట్రోల్ డీజిల్ రెట్లు పెంచేస్తున్నారు అంటూ, గొడవ గొడవ చేసేవారు. దేశంలో ఎక్కడా లేని రెట్లు మన రాష్ట్రంలో ఉన్నాయి అంటూ విమర్శలు చేసేవారు. తన సాక్షి పత్రిక, టీవీలో కూడా, అనేక వ్యతిరేక కధనాలు వేసే వారు. తాను ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు కూడా, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తాం అని చెప్పారు. కాని, ఇప్పుడు నెల రోజుల్లోనే రెండో సారి పెట్రోల్, డీజిల రేట్లు పెంచేసారు. నెల రోజుల క్రితం ఏపిలో పెట్రోల్, డీజిల పై వ్యాట్ పెంచిన ప్రభుత్వం, అది మర్చిపోక ముందే, ఈ రోజు మరోసారి, రేట్లు పెంచేసింది. పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ పెంచుతూ, ఈ రోజు జీవో ఇచ్చింది. లీటరు పెట్రోల్‌పై ఇప్పటి వరకు 31 శాతం వ్యాట్‌తోపాటు అదనంగా 2 రూపాయలు తీసుకునే వారు. ఇప్పుడు వ్యాట్‌+రూ.2.76 వసూలు చేసారు. అంటే, పెట్రోల్ పై 76 పైసలు పెంచారు. ఇక డీజిల్ పై, 22.25 వ్యాట్‌+రూ.2 గా ఉండగా, దాన్ని 22.25+3.07కు మార్చారు. అంటే, డీజిల్ రూ.1.07 పెరగనుంది. రేపటి నుంచి ఇవి అమలులోకి రానున్నాయి.

పెట్రోలు, డీజిల్ ధరలు తక్షణం తగ్గించాలి : కె ఇ కృష్ణ మూర్తి డిమాండ్ ... పెట్రోలు, డీజిల్ ధరలు నెలలో రెండుసార్లు పెంచి గతంలో ఇచ్చిన వాగ్దానాన్ని ఉల్లంఘించడంపై జగన్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని తెదేపా నేత కె ఇ కృష్ణ మూర్తి డిమాండ్ చేశారు. గత నెలలోనే వ్యాట్‌లో సవరణలు చేసి రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి, అది మరవక ముందే మరోసారి పెట్రోల్ ధరలు పెంచడం సరికాదని ఆయన సూచించారు. ఇప్పుడు పెట్రోల్ లీటర్‌పై 76 పైసలు, డీజిల్ లీటర్ రూ.1.07 పెంచుతూ ఉత్తర్వులు ఇవ్వడం ధరలు పెంచి ప్రజలపై భారం మోపడమే పాలనలా మారిందని ఎద్దేవా చేశారు. మాటలను మార్చడంలో ఘనుడు జగన్ అని మరోసారి రుజువయిందన్నారు. మాట తప్పను మడం తిప్పనన్న జగన్ ఇప్పుడు మాట, మడాన్ని అష్టవంకరలు తిప్పాడని విమర్శించారు.

దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం పెంచని విధంగా పెట్రోలు, డీజిలు ధరలు పెంచి ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రజలపై భారం మోపారని విమర్శించారు. ప్రతిపక్షనాయకుడిగా ఉన్నప్పుడు దేశంలో ఎక్కడాలేని విధంగా ఏపీలో పెట్రోలు, డీజిలు ధరలు ఉన్నందున తగ్గించాలని అసెంబ్లీలో మాట్లాడి ఆందోళనలు నిర్వహించిన సంగతి గుర్తు చేసుకోవాలన్నారు. ప్రతిపక్ష నేతగా ఒక మాట అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ, విద్యుత్ ధరలు నానాటికీ పెంచడం జగన్ పాలన్ చేతకాని తనానికి నిదర్శనమన్నారు. జ్ఞాపకశక్తి కోల్పోయి ప్రవర్తించడం జగన్ కే చెల్లుబాటయిందన్నారు. పెంచిన పెట్రోలు, డీజిలు ధరలు తక్షణం తగ్గించి ప్రజలపై భారం లేకుండా చేయాలని డిమాండ్ చేశారు. పెట్రోలు, డీజిలు ధరలు తగ్గించే వరకూ ప్రజల పక్షాన పోరాటానికి తెదేపా సిద్ధం అని హెచ్చరించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read