తెలుగుదేశం నేతల పై, ప్రభుత్వ వేధింపులు చేస్తుంది అంటూ తెలుగుదేశం నేతలు ఆరోపోస్తున్నా, ఉద్యమాలు చేస్తున్నా, జగన్ సర్కార్ మాత్రం, తగ్గటం లేదు. మరో తెలుగుదేశం నాయకుడిని టార్గెట్ చేసింది. 108 వాహనాల నిర్వహణలో, 307 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది అంటూ, తెలుగుదేశం పార్టీ నేత, కొమ్మారెడ్డి పట్టాభికి, ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి జవహర్ రెడ్డి జరీ చేసిన ఈ నోటీసులలో, వెంటనే ప్రభుత్వానికి క్షమాపణ చెప్పాలని, లేకపోతే క్రిమినల్ చర్యలు తీసుకుంటాం అంటూ, హెచ్చరించారు. అయితే దీని పై కొమ్మారెడ్డి పట్టాభి ఘాటుగా స్పందించారు. ప్రభుత్వ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని, క్షమాపణ చెప్పే పని లేదని, నేను అన్ని ఆధారాలతో, జీవోలతో మాట్లాడాను అని, దాని పై వివరణ ఇవ్వలేని ప్రభుత్వం, నోటీసులు ఇచ్చి బెదిరించి, తమ గొంతు నొక్కాలి అనుకుంటే, అది జరిగే పని కాదని అన్నారు. ప్రభుత్వ అవినీతికి సంబంధించి, మరిన్ని స్కాములు బయట పెడతానని అన్నారు.
ప్రభుత్వం ఎవరు ప్రశ్నించినా తట్టుకోలేక పోతుందని, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా సామాన్యులను బెదిరిస్తుందని, అలాగే ప్రతిపక్ష నాయకులు ప్రశ్నిస్తే తట్టుకోలేక నోటీసులు పంపిస్తుందని అన్నారు. ఇసుకలో, లిక్కర్ లో, మైన్స్ లో అనేక స్కాంలు బయట పడుతున్నాయని, ఎవరు ప్రభుత్వాన్ని ప్రశ్నించినా కూడా వారి పై తప్పుడు కేసులు పెట్టి, నోరు మూయించాలని చూస్తుందని, అవేమీ తమ దగ్గర కుదరవు అని అన్నారు. మేము ఎప్పుడు మాట్లాడినా, పూర్తీ ఆధారాలతో మాట్లాడతాం అని, వాటికి సమాధానం చెప్పకుండా నోటీసులు ఇస్తే ఎవరూ భయపడరని అన్నారు. విజయసాయి రెడ్డి అల్లుడు కంపెనీకి, ఎక్కువ రేటుకి ఎందుకు ఇచ్చారు అని జీవోలు చూపించి అడిగితే, వాటికి సమాధానం చెప్పకుండా, నోటీసులు పంపిస్తే ఏమి భయపడం అని, ఆ నోటీసుకు గట్టిగా సమాధానం చెప్తాం అని అన్నారు.