అవినీతి బురదలో కూరుకుపోయినా జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి, అనేక మంది వైసీపీ నాయకులు వారి పై ఉన్న బురదను సాక్షి దొంగ పత్రికాను చేతిలో పెట్టుకొని ఇతరులపై జల్లే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ అధికార ప్రతినిధి కోమ్మారెడ్డి పట్టాభి రామ్ అన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చిన్నతనంలో అలీబాబా అర డజన్ కథ విన్నాం..అలాగే ఇప్పుడు జగన్ బాబా జగమేరిగినా దోంగల కథ మనం ఇప్పుడు వింటున్నామని ఎద్దేవా చేశారు. లోకేష్ గారు మొన్న ఆస్తుల ప్రకటన చేస్తే దేవాన్ష్ ఆస్తులపై దోంగ ప్రతిక సాక్షి తప్పుడు రాతలు రాసిందని విమర్శించారు. దేవాన్ష్ కు తాత అయిన బాలకృష్ణ, వసుంధర గారు గిఫ్ట్ గా ఇచ్చారని ఆస్తుల ప్రకటనలో చెప్పడం జరిగింది. వాటిని దోంగ పత్రిక సాక్షి బాలకృష్ణ గారి ఎన్నికల అఫిడవిట్ లో లేవని రాయడం జరిగింది. అగస్టు 2 2018 ఇచ్చిన షేర్స్ అఫిడవిట్ ఎలా పొందుపరుస్తారని ప్రశ్నించారు. వైసీపీ నాయకులు ఆస్తులపై ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు వచ్చే దమ్ము ఉందా? మొదటి కథలో ఏటోరో ఫార్మ, అరవిందో ఫార్మ, వీళ్లకు ఎసీ జే పేరుతో ల్యాండ్స్ జండర్ల, శ్యామవరం అనే ప్రాంతంలో 150ఎకరాలు అడ్డుగోలుగా క్విట్ ప్రో కో ద్వారా వేల కోట్లు దోచుకున్నారు.
రెండోవ కథలో జగతి పబ్లికేషన్ సీపీ-9 2012 ప్రకారం సెక్షన్ 420, 409,468 అనేక కేసులు పెట్టారు. మూడోవ కథలో సీసీ-10 2012లో రాంకీ గ్రూప్ కు భూములు కట్టబెట్టి క్విట్ ప్రోకో ద్వారా వేల కోట్లు దోచుకున్నారని అన్నారు. నాలుగోవ కథలో నిమ్మగడ్డ ప్రసాద్ వాన్ పిక్ 28వేల ఎకరాలు కట్టబెట్టినందు రూ.854కోట్లు దోంగ పత్రికకు పెట్టుబడి పెట్టారని అన్నారు. ఐదోవ కథలో దాల్మియా సిమెంట్ భూములు కట్టబెట్టినందకు రూ.205 కోట్లు తిరిగి జగన్మోహన్ రెడ్డి కంపెనీలో పెట్టుబడులు జరిగాయని అన్నారు. ఆరోవ కథలో ఇండియా సిమెంట్ కంపెనీ భూమి కేటాయింపు, నీటి సౌకర్యాలు కల్పించినందకు రూ.140కోట్లు జగన్మోహన్ రెడ్డి కంపెనీలోకి చేరాయని చెప్పారు. ఏడోవ కథలో భారత సిమెంట్ దీనికి 2,37.532 ఎకరాలు కడప జిల్లాలో కట్టబెట్టారని అన్నారు. ఎనిమిదో కథలో పెన్నా సిమెంట్ కు సంబంధించి 231 ఎకరాలు అనంతపురం, 304 హెక్టారు కర్నూలు, 821 ఎకరాలు రంగారెడ్డి జల్లాలో కట్టబెట్టినందకు దాదాపు రూ.200 ఎకరాలు జగన్మోహన్ రెడ్డి కంపెనీల్లో చేరయని అన్నారు. తొమ్మిది, పదోవ కథలో జాతీయకోర్టు ఫిర్యాదు చేయడానికి ప్రధాన కారణం హిందు టెక్ జోన్, లేపాక్షి నాలెడ్జి హాబ్ పేరాట 8,844 ఎకరాలను అనంతపురంలో భూములు తసుకున్నందకు జగన్మోహన్ రెడ్డిపై కేసు నమోదు చేయడం జరిగిందన్నారు.
పదకొండువ కథలో హౌసింగ్ కు సంబంధించి హిందు గ్రూప్ అనేక అక్రమాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి పై కేసులు పెట్టారని అన్నారు. వారిని కాపడం కోసమే అనేక డ్రామాలాడుతున్నారని అన్నారు. ఈ 11 చార్జీషీట్ పై బహిరంగ చర్చకు వైసీపీ నాయకులు రావాలి. జనవరి 17, 2020 కేంద్రం ప్రభుత్వం ఇచ్చిన గేజిట్ ను చూసి వైసీప గుండెల్లో రైలు పరుగైతున్నాయని అన్నారు. జీవో నెం:51 ప్రకారం ఈఎస్ఐ మందుల కోనుగోలు విషయం రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని చెప్పడం జరిగిందన్నారు. ఈఎస్ఐ కోనుగోలు విషయంలో కూడా అచ్చెన్నాయుడి ప్రమేయంలేదని చెప్పారని అన్నారు. ఈఎస్ఐ పూర్తిగా కేంద్రం ప్రభుత్వంలో అధీనంలో ఉన్న వ్యవస్థ మరి మీరు ఏరకంగా అచ్చెన్నాయుడిపై అరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ లోపల, బయట బీసీలకు సంబంధించిన అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడం వలనే అచ్చెన్నాయుడిపై అక్రమ అరోపణలు చేస్తున్నారు. ముందు ధైర్యం ఉంటే సిట్టింగ్ జడ్జ్ తో విచారణ జరపాలని అన్నారు. మీ సొంత చెల్లే సిట్ విచారణను నమ్మడం లేదని చెబుతుంటే మీ ఎలా వేస్తున్నారో సమాధానం చెప్పాలని అన్నారు. ఏ సీట్ కమిటీలు వేసిన మేము భయపడాల్సిన అవసరం లేదన్నారు.