టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, శాసనసభా పక్ష ఉపనేత కింజరాపు అచ్చెన్నాయుడు అరెస్ట్ పై కొమ్మారెడ్డి పట్టాభిరాం మీడియా సమావేశంలో సంచలన విషయాలు చెప్పారు. "టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, శాసనసభా పక్ష ఉపనేత కింజరాపు అచ్చెన్నాయుడు గారిని అరెస్టు చేసిన విధానం అత్యంత ఆక్షేపణీయం. ఉగ్రవాదిని అరెస్టు చేసినట్లు పోలీసులు గోడలు దూకి వెళ్లి అరెస్టు చేయడం అప్రజాస్వామికం. అనైతికం. కనీసం ముందస్తు నోటీసులు కూడా ఇవ్వకుండా ఎలా అరెస్టు చేయడం రాజ్యాంగ ఉల్లంఘన కాదా.? శస్త్రచికిత్స చేసుకుని విశ్రాంతి తీసుకుంటున్న వ్యక్తి ఇంట్లోకి వందలాది మంది పోలీసులు కరోనాకు సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా వెళ్లడం మానవ హక్కులను ఉల్లంఘించారు. నోటీసులు లేకుండా ఎలా వచ్చారని ప్రశ్నించినందుకు అప్పటికప్పుడు ఓ కాగితంపై రాసి అరెస్టు చేశారు. గతంలో ఇలాగే వ్యవహరించినందుకు డీజీపీ హైకోర్టుకు సంజాయిషీ ఇచ్చినప్పటికీ.. పోలీసుల వ్యవహారశైలిలో మార్పు లేకపోవడం బాధాకరం. శస్త్ర చికిత్స చేసుకున్న వ్యక్తిని గంటల తరబడి తిప్పడం వలన మళ్లీ శస్త్ర చికిత్స చేయాల్సి రావడం పోలీసులు, ప్రభుత్వ నిరంకుశ విధానానికి నిదర్శనం. అచ్చెన్నాయుడు అరెస్టు కక్ష పూరితమని ఏసీబీ సమర్పించిన రిమాండ్ రిపోర్టులోని అంశాలు స్పష్టం చేస్తున్నాయి.

పేజి నెం.11లో 10.06.2020న కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏసీబీ వారికి మెమో పంపిస్తే.. దాన్ని ఏసీబీ డైరెక్టర్ జనరల్ ఆఘమేఘాలపై జూన్ 10న క్రైం నెంబర్ పెట్టి డీఎస్పీకి పంపితే అదే రోజు రాత్రి 11కు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. జూన్ 11న ఒక్కరోజే నలుగురిని విచారణ చేసేసి.. జూన్ 12 తెల్లవారు జామున శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో అచ్చెన్నాయుడిని అరెస్టు చేశారు. ఇదెలా సాధ్యమైందో రాష్ట్ర ప్రజలు ఆలోచించుకోవాలి. అచ్చెన్నాయుడి ఆరోగ్యం బాగా లేదని వైద్యాధికారులు చెప్పారు. అయినప్పటికీ ఇష్టానుసారంగా తిప్పడం వలన ఇప్పుడు మరోసారి శస్త్ర చికిత్స చేయాల్సి వస్తుందని చెప్పడం గురించి అధికారులు, వైసీపీ నేతలు సమాధానం చెప్పాలి. దీనికంటే ముందు జూన్ 10, మధ్యాహ్నం 12 గంటలకు సుప్రీం కోర్టు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసు విషయంలో తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగబద్ద పదవుల్లో ఉన్నవారిపట్ల ఇష్టానుసారంగా వ్యవహరిస్తే కుదరదు, ఎన్నికల కమిషనర్ తొలగింపు ఆర్డినెన్స్ వెనుక ఉద్దేశాలు సరిగా లేవని ఘాటుగా వ్యాఖ్యానించింది. దాన్ని ప్రజలంతా చూశారు. సోషల్ మీడియా హోరెత్తిపోయింది. అంతకు ముందు టీడీపీ విడుదల చేసిన ఛార్జి షీట్ పై ప్రజల్లో చర్చ మొదలైంది.

కోర్టుల నుండి పదే పదే తగులుతున్న ఎదురు దెబ్బలు, ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి, జే ట్యాక్స్, భూ కుంభకోణాలు, ప్రభుత్వ వైఫల్యాలను, ఇసుక కుంభకోణాలను సొంత పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నందున ఆ అంశాలని నుండి ప్రజల దృష్టి మరల్చేందుకు ప్రతిపక్ష నాయకుల అరెస్టు పర్వానికి ఈ బందిపోటు బ్యాచ్ కుట్రకు తెరలేపారు. అనుకున్నదే తడవుగా అచ్చెన్నాయుడు గారిని అరెస్టు చేశారు. రూ.43వేల కోట్ల ప్రజా ధనాన్ని దోచుకున్న బందిపోటు నాయకత్వంలో ఉన్న వారు కూడా నీతి, నిజాయితీ గురించి సిగ్గూ యగ్గూ లేకుండా మాట్లాడుతున్నారు. ఏసీబీ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న అంశాల గురించి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. అధికారులు కూడా గుర్తుంచుకోవాలి. ఇష్టానుసారంగా వ్యవహరిస్తే న్యాయస్థానాలు ఉపేక్షించవు. జగన్ మాటలు విన్న అధికారులు ఇప్పుడు ఎక్కడున్నారో, ఎలా కోర్టుల చుట్లూ తిరుగుతున్నారో గుర్తుంచుకోండి. మీరూ అలాంటి దుస్థితి తెచ్చుకోవద్దు.

శాసనసభ్యుల హక్కుల్ని కాపాడేలా స్పీకర్ వ్యవహరిస్తారు. కానీ.. మన స్పీకర్ మాత్రం ప్రభుత్వ మైక్ ముందు రాజకీయాలు మాట్లాడుతున్నారు. అధికారిక సమావేశాల్లో రాజకీయ నేతగా మాట్లాడడం బాధాకరం. జరిగిన ఉల్లంఘనలను గురించి ప్రశ్నించకపోగా ఉల్లంఘనలకు మద్దతిస్తున్నారు. ఇదేనా స్పీకర్ పదవికి మీరిచ్చే గౌరవం.? అనారోగ్యంతో ఉన్న శాసనసభ్యుడిని రోజంతా తిప్పారు. అర్ధరాత్రి వరకు తిప్పారు. మరి ఇదంతా శాసనసబ్యుడి హక్కుల ఉల్లంఘన కాదా.? వాటిపై స్పీకర్ గా మీరేం సూచనలు చేశారు.? అంసెబ్లీలో ప్రబుత్వన్ని నిలదీయడంలో అచ్చెన్నాయుడు గారు ముందుంటారు. అతనికి సమాధానం చెప్పే ధైర్యం లేక ఇలా దొంగచాటుగా అరెస్టు చేశారు. రూ.988 కోట్ల కుంభకోణంగా వైసీపీ విష ప్రచారం చేస్తున్నప్పటికీ.. ఇది కేవలం రూ .150 కోట్ల అధిక చెల్లింపులు మాత్రమే. అందులోనూ వాస్తవానికి అక్రమంగా జరిగిన చెల్లింపులు రూ.3 కోట్లు మాత్రమేనని ఈడీ స్పష్టం చేసింది. ఆ చెల్లింపులు కూడా చేసింది అధికారులు మాత్రమే. దానికీ అచ్చెన్నాయుడు గారికి ఏమాత్రం సంబంధం లేదు. ప్రభుత్వం చేస్తున్న అనైతిక పాలనను, అకృత్యాలను న్యాయపరంగా పోరాడుతాం. అవినీతి పరులు నీతి గురించి మాట్లాడుతున్నారు. ఆరు లక్షల కోట్ల అవినీతి పేరుతో జగన్ ప్రభుత్వం చేసిందేంటో ప్రజలంతా చూశారు. ఇదే పరిస్థితి అచ్చెన్నాయుడి కేసులో కూడా తేలుతుందని గుర్తుంచుకోవాలి. రాష్ట్రంలో ప్రతి కార్యకర్తకు తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుంది. ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తాం.

Advertisements

Advertisements

Latest Articles

Most Read