ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్‌కు నవ్యాంధ్ర రాజధాని ప్రాంతం, మంగళగిరి వేదిక కానుంది. ఐటిని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో గుంటూరు జిల్లా మంగళగిరి ఆటోనగర్‌లోని ఐటి పార్కులో 10 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన పై అమరావతి (పైడేటా)ని దేశంలోనే అత్యున్నత స్థాయిలో నిర్మించారు. శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పైడేటా ప్రాజెక్టును ప్రారంభిస్తారు.
ఆసియాలోనే అతి పెద్దదైన టైర్-4 డేటా సెంటరుగా ఇది రికార్డులకెక్కనుంది. సుమారు రూ.600 కోట్ల భారీ వ్యయంతో ఏర్పాటవుతున్న మంగళగిరి ఐటీ పార్కులోని పదెకరాల విస్తీర్ణంలో పై డేటా సెంటరును ఏర్పాటు చేస్తున్నారు.
తొలి దశలో తమ కంపెనీ ద్వారా సుమారు 1300 మందికి ఉద్యోగావకాశాలను రానున్నాయి. క్లౌడ్ ప్రాడక్ట్స్, క్లౌడ్ మేనేజ్‌డ్ సర్వీసులు, రిమోట్ సర్వీసులు, సెల్ఫ్ సర్వీసుల ప్రొవిజినింగ్ వంటి సేవలను ఈ కంపెనీ అందిస్తుంది.
తొలి దశ కింద గ్రౌండ్ ఫ్లోర్‌లో ఐదు వేల సర్వర్ ర్యాక్‌లను ఏర్పాటుచేశారు. ఒక్కో ర్యాక్‌లో 47 సర్వర్‌లకు స్థానం కల్పించినట్టు చెబుతున్నారు. 2018 నాటికి ప్రాజెక్టులో ర్యాక్‌ల సంఖ్యను 15వేల వరకు పెంపు చేసే అవకాశం వుంది.