ఆంధ్రప్రదేశ్ లో, వ్యవసాయానికి మంచి రోజులు వచ్చాయి. దేశంలోనే కాదు, ఆసియాలోనే సోలార్ ఎనర్జీ స్టోరేజ్ స్టోర్ చేసే విధానంలో ఆంధ్రప్రదేశ్ ముందు ఉంది. సోలార్ ఎనర్జీ స్టోరేజ్ తో, వ్యవసాయానికి ఇక నిరంతర విధ్యత్ అందనుంది. ఈ మాటలు అన్నది, సాక్షాత్తు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మంత్రి పియూష్ గోయల్. చంద్రబాబు గారిని ఈ విషయంలో పోగాడాల్సిందే అంటూ ట్వీట్ చేశారు.
వివరాల్లోకి వెళ్తే, చంద్రబాబు అమెరికా పర్యటనలో భాగంగా, సోలార్ ఎనర్జీ స్టోరేజ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. సోలార్ విద్యుత్ స్టోరేజ్ అవసరం అని భావించి టెస్లాను సంప్రదించగా, టెస్లా సుముఖత చూపించింది. 100 MW సోలార్ ఎనర్జీ స్టోరేజ్ చెయ్యాలనేది చంద్రబాబు సంకల్పం. ఇందుకోసం, ముందుగా ఒక పైలట్ ప్రాజెక్ట్ గా, 1 MW లిథియం బ్యాటరీలో, సోలార్ ఎనర్జీ స్టోరేజ్ కోసం టెండర్లు పిలిచారు.
ఇందుకోసం ఏపి ట్రాన్స్కో అధ్వర్యంలో, నెల్లూరు జిల్లా కస్సుమర్ర , విజయనగరం జిల్లా మక్కువ గ్రామాల్లో 1 MW సోలార్ ఎనర్జీ స్టోరేజ్ ప్లాంట్ నెలకొల్పుతున్నారు.
ఈ విధానం ద్వారా, సోలార్ ప్యానళ్లు ఏర్పాటు చేసుకుని ఉదయం విద్యుత్ ను వినియోగించుకుంటూనే.. లిథియం బ్యాటరీలో స్టోరేజీని చేసుకుని.. రాత్రి సమయంలో, లేదా వర్షాలు పడుతున్నప్పుడు దాన్ని వాడుకోవచ్చు. ఈ విధంగా వ్యవసాయానికి ఇక నిరంతర విద్యుత్ అందనుంది.
తొలిదశలో అగ్రికల్చర్ పంపుసెట్లకు వెళ్తున్న ప్రభుత్వం, తరువాత ఇంటి పైనే సోలార్ ప్యానల్ పెట్టుకుని, మన ఇంటి నుంచే సోలార్ విద్యుత్ తయారు చేసే వీలు ఉంటుంది. ప్రతి ఇంటా సోలార్ ప్యానళ్లును ఏర్పాటు చేసుకుని.. ఆ ఇధనాన్ని వినియోగించుకుంటూనే.. మిగిలిన విద్యుతను గ్రిడ్‌కు అనుసంధానం చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు.
సోలార్ పవర్ ఉత్పాదకత, స్టోరేజ్‌తో రెండవ దశ విద్యుత్ సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నామని, ముఖ్యమంత్రి ఈ మధ్య తరుచూ చెప్తున్నారు. సమీప భవిష్యత్తులో కరెంటు చార్జీలు పెరగవని, ఇక తగ్గుతాయి అని, పదే పదే చెప్పటానికి కారణం ఇదే.