ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గురించి నెగటివ్ రిమార్క్స్ చెప్తూ, ఈ మధ్య రాజ్యసభలో, పార్లమెంట్ లో కేంద్రం చేస్తున్న ప్రకటనలు, నిజంగానే మన పరువుని బజారున పడేస్తున్నాయి. వారం క్రితం, అన్నమయ్య ప్రాజెక్ట్ విషయం పైన, రాష్ట్ర ప్రభుత్వ నిర్ల్యక్ష వైఖరిని నిరసిస్తూ, కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఏపి రాష్ట్ర ప్రభుత్వం వల్ల, అంతర్జాతీయ స్థాయిలో, దేశం పరువు పోతుందని వాపోయారు. తరువాత రైల్వే ప్రాజెక్ట్ ల విషయంలో, ఏపి సహకారం లేదని, రాష్ట్ర వాటా ఇవ్వకపోవటంతో, రైల్వే ప్రాజెక్ట్ లు ఆగిపోయాయని అన్నారు. తాజాగా నిన్న మరోసారి ఇలాగే ఏపి పరువు పోయే విధంగా , రాజ్యసభలో సంచలన వ్యాఖ్యలు చేసారు, కేంద్ర మంత్రి పియూష్ గోయల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్ర విచిత్ర పరిస్థితి ఉందని, రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేదని, కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ సంచలన వ్యాఖ్యలు చేసారు. హైదరాబాద్ - బెంగుళూరు ఇండస్ట్రియల్ కారిడార్ కు సంబంధించి ఓర్వకల్లు నోడ్ లో పది వేల ఎకరాలతో ప్రణాలిక ఇచ్చి, ప్రాతిపాదనలు ఒప్పుకుంటే, ఏపి ప్రభుత్వం దాన్ని రెండుగా విడగోట్టిందని, సగం భూమి మాత్రమే ప్రాజెక్ట్ కు ఇచ్చి, మిగతా సగం భూమి తామే చూసుకుంటాం అని చెప్పిందని, ఇలా అయితే ప్రాజెక్ట్ ఎలా ముందుకు వెళ్తుందని ప్రశ్నించారు.

piyush 11122021 21

ఇక ఇండస్ట్రియల్ కారిడార్ లో, కృష్ణపట్నం నోడ్ కు సంబంధించి, రాష్ట్ర ప్రభుత్వం వేసిన టెండర్ల పైన, కాంట్రాక్టర్లు అనేక అభ్యంతరాలు వ్యక్తం చేసారని, సభకు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఇండస్ట్రియల్ కారిడార్ లకు సంబంధించి, ఎప్పటికప్పుడు కొత్త ప్రాజెక్ట్ లు ఇస్తున్నా, రాష్ట్ర సహకారం లేకపోవటంతో, వాటిని అమల్లోకి తీసుకుని రాలేక పోతున్నాం అని, పియూష్ గోయాల్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేయాలని, అలాగే ఆ భూమి మొత్తం ఒకే చోట ఉండేలా చూడాలని, అప్పుడే ఒక ప్రాజెక్ట్ ముందుకు వెళ్తుందని అన్నారు. చెన్నై-బెంగుళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో, కాంట్రాక్టర్ ను రాష్ట్ర ప్రభుత్వం నియమించలేదని అన్నారు. టెండర్ లు వేసి కాంట్రాక్టర్ కు ఇచ్చే ప్రక్రియ పై, రాష్ట్ర ప్రభుత్వం పైన, అనేక మంది కాంట్రాక్టర్ లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు, ఈ ప్రక్రియ కూడా రాష్ట్ర ప్రభుత్వం సవ్యంగా చేపట్టాలని అన్నారు. ఇలాంటి ప్రాజెక్ట్ ల విషయంలో, రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తేనే, ఈ ప్రాజెక్ట్ లు సక్సెస్ అవుతాయని అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read