"అశోక్ గజపతిరాజుని నేనే గెలిపించా" ఓ పెద్దమనిషి ఇచ్చిన ఈ స్టేట్మెంట్ చూసి నవ్వుకున్నా.. పూసపాటి మహారాజుల వంశీయుల్లో శ్రీ అశోక్ గజపతి రాజుగారు నేను స్వయంగా చూసిన ఓకే ఒక్క మహారాజుగారు.. నరనరాన సామాజిక స్పృహ ఉన్న రాచబిడ్డ.. రాజకీయాల్లో కంటే సొంత ఆస్థులతోనే ఎక్కువ మంచిపన్లు చేసిన మనసున్న మారాజు గారు.. వాళ్ళ కోట చుట్టుపక్కనున్న చాలావరకు స్థలాల్ని పబ్లిక్కి నివాసాల కోసం, ఉపాధి కోసం దానధర్మాలుగా ఇచ్చేశారని అక్కడున్న ఎవర్నడిగినా పైకి తలెత్తి, దణ్ణం పెట్టుకుని మరీ చెప్తారు.. అందంగా అలరారే కలెక్టర్ ఆఫీస్ కాంపౌండ్, త్రాగునీటి పథకానికి రాజుగారు చేసిన కృషి, మహారాజ హాస్పిటల్స్.. ఇవన్నీ చూస్తే చాలు.. కడుపు నిండిపోయి ఆయనతో మాట్లాడకుండానే ప్రేమ కలుగుతుంది.. వాళ్ళు నివాసం ఉండే పాలస్ తప్ప మిగతా రాజభవనాలన్నిటినీ విద్యాకేంద్రాలుగానో, ఇన్స్టిట్యూట్స్గానో మార్చేసిన విద్యా దాత.. చైర్మన్ ఆఫ్ మహారాజ అలక్ నారాయణ సొసైటీ ఆర్ట్స్ & సైన్స్ (MANSAS) అనేది ఒకటి స్థాపించారని దాని కింద 12 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయని అక్కడ చదువుకుని ఎక్కడెక్కడో స్థిరపడ్డ తెలుగుతేజాలు చెప్తాయి..

pk 02062018 2

విజయనగరంలో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లాంటిది ఒకటి ఏర్పాటు చేశారని, అక్కడ కోచింగ్ తీసుకున్న నలభైమందిలో ఇద్దరు కుర్రాళ్లు IPL లో కూడా ఆడారన్న మేటర్ ఎవరికి మాత్రం తెలుస్తుందిలే.. ఇలాంటి స్పోర్ట్స్ సెంటర్లు లాంటివే ఇంకా హైదరాబాద్, వైజాగుల్లో కూడా చేయడంలో ఈ రాజుగారి హస్తం ఉందని జనాలకి తెలిస్తే ఇంకేమైనా ఉందా?? భ్రమలు బుడగల్లా పేలిపోవూ..?? విశాఖలో ఒకప్పుడు అంతర్భాగంగా ఉండే విజయనగరాన్ని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయడంలో రాజుగారి పాత్రేంటో బట్టలకి ఫేమస్ అయిన విజయనగరం MG రోడ్ నించి పాటలకు ఫేమస్ అయిన గరివిడి దాకా అందరికీ తెల్సు.. బయటవాళ్ళకి ఎలా తెలుస్తుంది..? ఆయన తండ్రిగారు విజయనగరానికి పట్టాభిషిక్తులైన చిట్టచివరి మహారాజాగారు.. కానీ ఈయన దగ్గర ఆ భుజకీర్తులేమీ కనిపించవు.. అంతటి మహారాజు బిడ్డ కూడా రాజకీయాల్లోకి వచ్చేసరికి సాధారణ మంత్రిలాగే కనబడ్డాడంటే అది ఆయన తప్పు కాదు.. ఆయన స్థానానికే ఆ మంత్రి పదవి చిన్నదని అర్ధం.. ఒక ఊరి కరణం ఇంకో ఊరికి జుట్టుపోలిగాడని రాజకీయాల్లో ఉన్న పనికిమాలిన సూత్రం కదా..

pk 02062018 3

ఎవ్వరి చేతా వేలెత్తి చూపించుకోని వ్యక్తిత్వం.. నీతి, నిజాయితీలకి నిలువుటద్దం.. పంక్చువాల్టీ అంటే ప్రాణం.. శత్రువులు సైతం లేచి చేతులు జోడిస్తారట.. 1989లో అప్పటి ప్రభుత్వం చేత ఉత్తమ ఎమ్మెల్యేగా సత్కారం.. ఇప్పుడు కొత్తగా సంపాదించేది ఏమి లేదు.. అంతకంటే ఏం కావాలి? 1978 నించి మొదలుకుని 1983, 1985, 1989, 1994, 1999, 2009.. ఇలా ఒక్క 2004లో తప్ప మిగతా అన్నిసార్లు వరుసగా MLAగా గెలిచారు.. సారీ.. ఆయన గెలవలేదు.. జనాలు గెలిపించుకున్నారంటే బాగుంటుంది.. ఆయన మీద ఇక్కడి ప్రజల అభిమానం అలాంటిది.. విజయనగరం వెళ్తే అక్కడి జనాలు ఆయన్ని మినిష్టర్గానో, రాజకీయ నాయకుడిగానో చూడరు.. వాళ్ళని పరిపాలించిన "రాజుగారు".. అంతే.!! ఈ రాజకీయాలు అవి వాళ్ళ స్థాయికి తగ్గవి కావు.. ఇంకో విషయం గుళ్ల ఉద్ధరణ.. ప్రతి ఏటా ఘనంగా జరిగే పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవ వేడుకలు గుర్తున్నాయా..? ఆ అమ్మవారు పూసపాటి వంశీకుల ఆడపడుచంట.. అలాగే సింహాచలం శ్రీ వరహనరసింహస్వామి వారి దివ్యక్షేత్రానికి అనువంశిక ధర్మకర్తలు కూడా.. రాజుగారి వైభోగం ఆ చందనోత్సవం రోజునే చూసి తీరాలి.. ఏం గౌరవం అసలు?

అనాలంటే ఎప్పుడో బొబ్బిలి యుద్ధం సినిమాలో "బుస్సిదొరతో చేతులు కలిపి బొబ్బిలి రాజుల్ని ఓడించిన విజయరామరాజు" ని గుర్తు తెచ్చుకుని వీళ్ళ వంశాన్ని నిందించాలి తప్ప దేవుడులాంటి ఈ రాజుగార్ని అనడానికి ఇప్పుడునోళ్లు ఎవ్వరూ సరిపోరు.. ఎంతవరకు నిజమో తెలీదు.. అరవై ఏళ్ల క్రితమే అశోక్ రాజు గారి తాతగారు లైసెన్స్డ్ పైలట్ అని, వాళ్ళ పాత కోటకి వెళ్ళడానికి వాళ్ళ సొంతభూముల్లోనే రన్ వే కూడా ఉండేదని అతి కొద్దిమందికే తెల్సు. అప్పటికి వాళ్ళ తాతగారు కూడా ఊహించి ఉండరు.. భవిషత్తులో ఇండియాకి స్వాతంత్రం కూడా వచ్చి, తన మనవడు కేంద్ర విమానశాఖకే ఏకైక తెలుగు మంత్రి అవుతారని.. అలాంటి రాజుగార్ని ఒకరు గెలిపించడమేంటి?? వాళ్ళ అజ్ఞానం కాకపోతే.. నేను బొబ్బిల్లో చదివేటప్పుడు "మా అశోక్ రాజుగారు లేచినెంటనే పాన్పు మీద నించి కాలు కింద పెట్టేలోపు చెప్పులు తొడగటానికి కూడా పనోళ్లు ఉంటారు" అని కళ్ళు మూసుకుని తన్మయత్వంగా చెప్పే పేరుగుర్తులేని మా విజయనగరం జూనియర్ గాడి మాటలు గుర్తొచ్చాయి.. "ఎందుకురా అలా" అనడిగాను.. "ఆయన రాజుగారు అన్నయ్యా" వాడి సమాధానం.. ????????

Advertisements

Advertisements

Latest Articles

Most Read