రాజకీయంగా ఎవరు ఏమైనా మాట్లాడండి... కాని హైదరాబాద్ లో ఉండే మీరు, ఇక్కడకి చుట్టపు చూపుగా వచ్చి, మా ప్రాంతాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, దిగజారుస్తాం అంటే మేము మీతో విభేదిస్తాం పవన్... మీరు ఇప్పుడు ఒక వ్యక్తి కాదు, మీరు ఒక పార్టీ అధినేత... ఒక సిటీని పట్టుకుని ఇలా దిగాజారుస్టారా ? మీరే ఇలా మాట్లాడితే, రేపటి నుంచి విచక్షణ లేని నీ ఫాన్స్ విజయవాడని, అమరావతిని ఇంకా ఎంతలా దిగాజారుస్తారో ఆలోచించావా పవన్ ? లేకపోతే జగన్ లాగా, నీకు కూడా మా అమరావతి అంటే ఏడుపా ? నీ కడుపులో విజయవాడ మీద ఉన్నది అంతా ఇలా కక్కవా ? తెలంగాణలో కులం సమస్య లేదా ? విజయవాడకు రాజధాని అయ్యే లక్షణాలు లేవా ? రెండు రోజులు వచ్చి హైదరాబాద్ వెళ్ళే నీకు, ఏమి తెలుసు పవన్ మా సమాజం గురించి ?

pawan 08122017 2

హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చిన నీ స్నేహితుడు కొడుకుని, స్కూల్ లో అడ్మిషన్ కి కులం అడిగారా ? ఎందుకు పవన్ అలా అబద్ధాలు చెప్తున్నారు ? ఆ స్కూల్ పేరు ఏంటో కూడా చెప్పండి ? అలాంటి స్కూల్ ఒక్కటి కూడా విజయవాడలో లేదు పవన్... ఇలా దిగజార్చమాకండి.. ఎప్పుడో 25 సంవత్సరాల క్రితం జరిగన రెండు కుటుంబాల గొడవని, మా బెజావడకి పులమమకా... అవన్నీ మర్చిపోయి, అందరూ ఈ సమాజంలో ప్రశాంతంగా బ్రతుకుతున్నాం... మీ రాజకీయం కోసం, ఈ సిటీకి ఆ మారక మళ్ళీ పులమమాకండి...

pawan 08122017 3

నువ్వు పుట్టి పెరిగాన తెలంగాణాలో లాగా, నేను దొరని నువ్వు నా కాళ్ళు మొక్కాలి అని అనరు... ఆ అహంకారం మాకు లేదు.... మా బెజవాడలో అన్ని కులాల వారు ఆత్మ గౌరవంతో బ్రతుకుతున్నారు..... అందుకే సిటీ రోజు రొజుకీ పెరుగుతుంది... పక్కన ఉన్న గుంటూరుని కలుపుకుని ఆంధ్రుల రాజధాని అయ్యింది... నువ్వు తిరిగిన హైదరాబాద్లో ఈనాటికి సాయంత్రం అయుదు గంటలు ఐతే , వేరే ప్రాంతం వాడు పాత బస్తీలో తిరగలేడు...ఈ రోజుకి అక్కడ ఒక మతం వాళ్ళ క్రూరత్వం ఉంటుంది.... కాని మా బెజావాడ పాత బస్తీలో, రాత్రి పది గంటల దాకా వ్యాపారాలు జరుగుతాయి, మా బెజావాడలో ముస్లింలు చాలా ఆప్యాయతతో ఉంటారు... మా అమరావతి, మా బెజవాడ, గుంటూరు తో కలుపుకుని రాజధానిగా “అభివృద్ధి” లో దూసుకుపోతుంది... రాష్టంలో అన్నిచోట్లా, ఇంకా చెప్పాలంటే దేశంలో అన్నిచోట్లా ఉన్నట్లే ఇక్కడా అన్ని కులాలవాళ్ళు ఉండవచ్చు.. అంతేగానీ ఎక్కడా లేని కులాలు ఇక్కడే ఉన్నట్లు నీ రాజకీయం పబ్బం కోసం కబుర్లు చెప్పవద్దు పవన్... మీరు అంటే ఆంధ్రలో చాలా మందికి గౌరవం ఉంది... ఆ గౌరవం ఇలాంటి మాటలతో పలుచన చేసుకోవద్దు...

Advertisements

Advertisements

Latest Articles

Most Read