మొన్న విజయవాడలో పార్టీ ఆఫీస్ ఓపెన్ చేస్తూ, మీడియా సమావేశంలో పవన్ ఒక మాట చెప్పారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరు అని. అదే విధంగా, ఈ మధ్య తరుచూ, జగన్ తో నాకు వ్యక్తిగత కక్ష ఏమి లేదు, జగన్ అంటే నాకు కోపం లేదు అంటూ, పవన్ పదే పదే చెప్తున్నారు. నిజానికి పవన్ చెప్పింది కరెక్ట్ కూడా. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరు. అందుకే రాష్ట్రాన్ని నమ్మించి మోసం చేసిన మోడీని ఎదుర్కుంటానికి, కాంగ్రెస్ పార్టీ సహయం కూడా తెలుగుదేశం తీసుకుంటుంది. అయితే ఇక్కడ మాత్రం, ఏపికి చంద్రబాబు చేస్తున్న సేవలు నచ్చక, పవన్, జగన్, బీజేపీ ఒక్కటై, పని చేస్తున్నారు.
ఇది ఇలా ఉంటే, నిన్న "కారులో కవాతు" చేసిన పవన్, తరువాత ఒక మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో, ఎప్పటిలాగే లోకేష్ భజన చేసి, చంద్రబాబుని, చింతమనేని తిట్టారు. మోడీ అనే మాట కూడా పలకలేదు. ఇవన్నీ ఇట్లా ఉంటే, పవన్ కళ్యాణ్ జగన్ మీద చేసిన వ్యాఖ్యలు మాత్రం, ఆలోచింప చేసే లా ఉన్నాయి. అవినీతి పై యుద్ధం అంటున్న పవన్, అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ అయిన జగన్ మోహన్ రెడ్డి అవినీతి చేసాడని ఎవరికి తెలుసు, అది దేవుడికే తెలియాలి అంటూ కొత్త పల్లవి అందుకున్నాడు. జగన్ మీద తనకు కోపం లేదని..ఆయన లక్ష కోట్లు తిన్నారో లేదో.. ఆ భగవంతుడికి తెలియాలని పవన్ అన్నారు.
అంతే కాదు వైఎస్ పై మాత్రం కోపం ఉంది అంటూ, దానికి కారణం చెప్పారు. 2007లో వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఓ సినిమా తీయాలని తనపై ఒత్తిడి తెచ్చారని, కోట్ల మంది అభిమానులున్న తనలాంటి వాడినే అలా బెదిరిస్తే సామాన్యులను ఎంత బాధపెడతారో అని కోపం వచ్చిందని పవన్ చెప్పారు. ఈ వ్యాఖ్యలు చూస్తుంటే, అందరూ అనుకుంటున్న విధంగానే, అమిత్ షా డైరెక్షన్ లో, పవన్, జగన్, కలిసి ఎన్నికలకు వెళ్ళటానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. మోడీని చంద్రబాబు డీ కొడుతున్నారు కాబట్టి, అమిత్ షా వీళ్ళ ఇద్దరినీ కలిపి, చంద్రబాబు మీదకు వదులుతున్నాడు అనేది స్పష్టం.