రాజకీయాల్లో ఎన్నో విమర్శలు చూస్తూ ఉంటాం... చాలా పర్సనల్ గా తిట్టుకుంటారు... విజయసాయి రెడ్డి, జగన్ లాంటి వారి నోటికి ఎలాంటి మాటలు వస్తాయో కూడా తెలీకుండా తిడతారు... ఇవన్నీ ఒకెత్తు అయితే, ఎప్పుడో సంవత్సరాల క్రితం చెప్పిన మాట పట్టుకుని, వారాలు వారాలు అదే మాట చెప్పటం మాత్రం ఇప్పుడే చూస్తున్నాం... అశోక్ గజపతి రాజు గారు, దాదాపు సంవత్సరం క్రితం, విలేకరులు ఎదో అడగగా "పవన్ కళ్యాణ్ అంటే ఎవరో నాకు తెలీదు" అన్నారు.. అది కూడా పవన్ కళ్యాణ్ మన రాష్ట్ర ఎంపీలను, మంత్రులను, పార్లమెంట్ లో గోడలు చూడటం తప్ప ఏమి చెయ్యరు అని అంటే, ఆ విషయం విలేకరులు రాజు గారి దగ్గర ప్రస్తావిస్తూ, మీ రియాక్షన్ ఏంటి అంటే, అప్పుడు అన్నారు, పవన్ అంటే ఎవరో నాకు తెలీదు అని...
ఆ వెంటనే దీని పై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ, నేను తెలీదు అంటారా అని ఎదో నాలుగు మాటలు అన్నారు... ఇలాంటి విమర్శలు, ప్రతి విమర్శలు చాలా సహజం... అయితే, సంవత్సరం క్రితం అయిపోయిన విషయం తీసుకువచ్చి, పవన్ కళ్యాణ్, మళ్ళీ అదే మొదలు పెట్టారు.. 10 రోజుల క్రితం శ్రీకాకుళంలో మొదలైన మ్యూజిక్, విజయనగరం జిల్లా దాటుతున్నా, ఇదే గోల ... నేను ఎవరో తెలీదు అంటారా అంటూ, రోజు ఇదే పీక్కోటం.. నిన్న అయితే, "అశోక్ గారూ.. నేను మీ విజయనగరం వచ్చాను.. మీ కోట దగ్గరకు వచ్చాను. నా పేరేనండి పవన్ కల్యాణ్. నన్ను పవన్ కల్యాణ్ అంటారు. నేను మీకోసం 2014లో ప్రచారం చేశాను. మీరు అనుభవించిన కేంద్రం మంత్రి పదవికి కారకుడినండి."అంటూ పీక్స్ కి వెళ్ళిపోయాడు పవన్...
గత పది రోజుల నుండి, నేను ఎవరో తెలీదు అంటారా అంటూ, పవన్ కొడుతున్న డైలాగ్ చూసి, సోషల్ మీడియాలో కూడా సటైర్లు మొదలయ్యాయి... అయినా పవన్ మాత్రం ఆపటం లేదు... ఇక పవన్ ఈ డైలాగ్ ఆపాలి అంటే, అశోక్ గజపతి రాజు గారు ఒక్కసారి నాకు పవన్ అంటే తెలుసు, పవన్ వల్లే నేను గెలిచాను, పవన్ వల్లే నాకు మంత్రి పదవి వచ్చింది అని చెప్పాలేమో... నేను మీ ఇంటికొచ్చా, మీ వీధికొచ్చా, కోట ముందుకొచ్చా అని తన ఫాన్స్ ను రంజింపజేయడం కోసం సినిమా డైలాగులు చెబుతుంటే, అశోక్ గజపతి రాజు గారు ఒక్కసారి "ఆ.. సరేలే" అంటే కాని, పవన్ ఇగో చల్లారదేమో... తెలుగుదేశంలో గెలిచిన 102 మంది ఎమ్మల్యేలు, 17 మంది ఎంపీలు, మాకు పవనే దేవుడు అనే దాక, ఈయాన ఇలా డైలాగులు చెప్తూనే ఉంటాడేమో...