వైఎస్ జగన్ పాదయాత్ర మూడో రోజు కొనసాగుతుంది... అయితే మూడో రోజు మాత్రం, జగన్ పక్కన ఉన్న అమ్మాయి గురించి అందరూ ఆరా తియ్యటం మొదలు పెట్టారు... బ్లాక్ టీ షర్ట్, జీన్స్ వేసుకుని, జగన్ సభలో, జగన్ పక్కనే నిలబడింది... సామాన్యంగా, స్థానిక నాయకులు కాని, మిగతా పార్టీ వారు కాని, జగన్ పక్కన నిలబడతారు... లేకపోతే, సాక్షి టీవీకి చెందిన నలుగురు కెమెరా మెన్లు జగన్ చుట్టూ నిలబడి వేరే వేరే యాంగిల్స్ లో కవర్ చేస్తూ ఉంటారు... అయితే, కొత్తగా ఈ అమ్మాయి నిలబడటంతో అందరూ ఆశ్చర్యపోయారు... ఎవరన్నా nri ఏమో, వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం ఏమో అని, ఇలా రక రకాలుగా మాట్లాడుకున్నారు...
చివరకి ఆరా తీస్తే, ఆమె ప్రశాంత్ కిషోర్ టీం మెంబెర్ అని తేలింది... అంతే, ఒకే సారి అక్కడ ఉన్న వారికి దిమ్మ తిరిగింది.. అందరూ అంటూ ఉంటే, ఎదో రాజకీయ విమర్శలు అనుకున్నాం, చివరకి జగన్ ఇలా దిగజారిపోయాడు ఏంటి అనుకున్నారు... బహిరంగంగా, ఇలాంటి కన్సల్టంట్ లని, ఆయన పక్కన నుంచో పెట్టి, క్యాడర్ కు ఏమి సంకేతం ఇస్తున్నాడు ? ప్రజలు ఏమి అర్ధం చేసుకోవాలి అని సొంత పార్టీ కార్యకర్తలే అనుకుంటున్నారు... ఎవరైనా, ఇలాంటి వారిని బహిరంగంగా పక్కన నుంచో పెడతారా ? మన బలహీనత మనమే చూపించుకుంటామా ? జగన్ మరీ ఇలా దిగజారిపోయి, ఆ ప్రశాంత్ కిషోర్ ఏమి చెప్పినా, వినేలా లొంగిపోయాడు ఏంటి, అని అనుకుంటున్నారు...
ఇది కూడా ప్రశాంత్ కిషోర్ ఐడియా అని పార్టీ వర్గాలు అంటున్నాయి... జగన్ చెప్పే దాంట్లో ఎమన్నా మర్చిపోయినా, అందించటానికి, ఈ టీంను సెట్ చేశాడు అంట పీకే... జగన్ ఏమి మాట్లాడాలి అనేది పీకే టీం ప్రిపేర్ చేస్తుంది కాబట్టి, వారు జగన్ పక్కనే ఉండి ప్రాంప్ట్ చేస్తారు అంట... బయటకు మాత్రం, ప్రజల రెస్పాన్స్ ఎలా ఉందో, మేమే స్వయంగా రికార్డు చేస్తున్నాం అని చెప్తున్నారు... దాదాపు 50 మంది ప్రశాంత్ కిషోర్ టీం జగన్ తో పాటే ఉంటున్నారు... స్క్రిప్ట్ దగ్గర నుంచి మొత్తం వారే దగ్గర ఉండి చూసుకుంటున్నారు... వారి కోసం ప్రత్యేక వాహనాన్ని కేటాయించారు. ప్రజల మధ్య నుంచి వచ్చే నాయకులని నమ్మకుండా, జగన్ ఇలాంటి పైడ్ కన్సల్టెంట్ లని, నమ్మి ఏమి సాధిస్తాడో, ఆయనకే తెలియాని... చివరకి వీరిని పక్కన నుంచో పెట్టి రాజకీయ యాత్రలు చేస్తున్నాడు అంటే, ఈయన స్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు....