ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం దారుణంగా ఫెయిల్ అయిన నేపధ్యంలో, అన్ని విపక్షాలు కలిసి పోరాడటానికి సిద్ధం అవుతున్నాయి. 151 సీట్లతో గెలిచిన ఏ ప్రభుత్వం అయినా, ప్రజలకు సేవ చేసి మరింత మంచి పేరు తెచ్చుకోవాలని చూస్తుంది. అయితే వైసీపీ ప్రభుత్వం మాత్రం ఇందుకు భిన్నం. సాధారణంగా ఏ కొత్త ప్రభుత్వానికి అయినా, ఆరు నెలలు హనీమూన్ పీరియడ్ అనేది ఉంటుంది. వారు కుదుటపడి పరిపాలన గాడిలో పడటానికి టైం పడుతుంది. అందుకే విపక్షాలు కూడా ఏమి విమర్శలు చెయ్యవు. సీనియర్ అధికారులు ఉంటారు కాబట్టి, ప్రభుత్వ పెద్దలు ఏమైనా తప్పులు చేసినా, కరెక్ట్ చేస్తారని ఎవరైనా అనుకుంటారు. కాని, మన రాష్ట్రంలో పరిస్థితులు పూర్తీ భిన్నం. అధికారులు చెప్పిన మాట వినే పని లేకుండా, ఇష్టం వచ్చినట్టు పరిపాలన చెయ్యటంతో, వంద రోజుల్లోనే ప్రజలకు చుక్కలు కనిపిస్తున్నాయి. కోలుకోలేని విధంగా జీవితాలు తారుమారు అయిపోతున్నాయి. రాజకీయ దాడులు విపరీతం అయిపోయాయి.
అయితే రాజకీయ దాడులు అంటే, ఒక పార్టీకి సంబంధించిన విషయం అని చెప్పి పక్కన పెడదాం. రాష్ట్రంలో 40 వేల మంది ఎఫెక్ట్ అయ్యేలా, భవన నిర్మాణ కార్మికులు నానా ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రంలో ఇసుక లేక అల్లాడిపోతున్నారు. పనులు లేక పస్తులు ఉంటూ, చివరకు చనిపోవటానికి కూడా సిద్ధపడుతున్నారు. దీంతో ప్రాధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ, ఈ విషయం పై ఆందోళనలు చేస్తుంది. ఇప్పటికే రెండు సార్లు ఆందోళనలు చేసారు. ఈ రోజు నారా లోకేష్ కూడా దీక్ష చేసారు. అలాగే జిల్లాల్లో ఆందోళనలు కూడా చేస్తున్నారు. ఇన్ని చేస్తున్నా ప్రభుత్వం మాత్రం లెక్క చెయ్యటం లేదు. అలాగే కమ్యూనిస్ట్ పార్టీ, బీజేపీ నేతలు కూడా ఆందోళన చేస్తున్నారు. ఇప్పుడు మరో ప్రతిపక్షం జనసేన కూడా ఈ పోరాటంలో జాయిన్ అయ్యింది.
నవంబర్ 3న విశాఖలో జనసేన, ఇసుక కొరతకు వ్యతిరేకిస్తూ, లాంగ్ మార్చ్ చేయ్యనుంది. ఈ నేపధ్యంలోనే, అన్ని ప్రతి పక్ష పార్టీలు కలిసి పోరాడాలని, తమ పోరాటంలో కలిసి రావాలని, తెలుగుదేశం పార్టీ అధినేతకు ఫోన్ చేసారు. ఈ రోజు చంద్రబాబు కృష్ణా జిల్లా సమీక్షలో ఉండగా, పవన్ కళ్యాణ్ నుంచి ఫోన్ వచ్చింది. నవంబర్ 3న విశాఖలో జనసేన తలపెట్టిన ర్యాలీకి మద్దతు కోరారు. దీని పై స్పందించిన చంద్రబాబు, ఎలాంటి ప్రజా పోరాటానికైనా, తెలుగుదేశం ఎప్పుడూ మద్దతు ఇస్తుందని అన్నారు. ఇసుక సమస్య, పరిష్కారానికి ఏమి చెయ్యాలి, ప్రభుత్వాన్ని ఎలా మేల్కొల్పాలి అనే విషయం పై, ఇరువురు నేతలు, దాదపుగా, 15 నిమిషాల పాటు చర్చించారు. పవన్ కళ్యాణ్, కన్నా లక్ష్మీనారాయణకు కూడా ఫోన్ చేసి, మద్దతు అడిగారు.