జగన్ నామస్మరణ పనికిరాడు అనుకున్నాడో ఏమో, బీహార్ బాబు మరో చచ్చు సలహాతో ముందుకు వచ్చారు... మూడున్నరేళ్ల క్రితం వరకూ క్షేత్రస్థాయికి తీసుకువెళ్లి, తర్వాత పెద్దగా ప్రచారానికి నోచుకోని వైఎస్ రాజశేఖర్ రెడ్డిని మళ్లీ తెర పైకి తీసుకువచ్చేందుకు వైసీపీ కన్సల్లెంట్ ప్రశాంత్ కిశోర్ ప్లాన్ వేశారు. 9121091210కు మిసిడ్ కాల్ ఇచ్చి వైఎస్ కుటుంబంలో చేరమంటున్నారు... చేరగానే మీ సమస్యలు ఏవైనా చెప్తే తీర్చేస్తారు అంట... కాని ఇక్కడ ఒక షరతు... జగన్ సియం అయినాకే మీ సమస్య తీరుస్తారు... అప్పటి వరకు ప్రభుత్వంతో పోరాడటం లాంటి పనులు ఉండవు.. అన్న సియం అవ్వాలి, మీ సమస్య తీరాలి...
ఈ మిసిడ్ కాల్ కుటుంబంలో, రాష్ట్రం లోని కోటి మందికి వైసీపీని నేరుగా చేర్చే ప్రణాళికకు పదునుపెట్టినట్లు "పికె' వర్గాలు చెప్పాయి. వైఎస్ వర్ధంతి పురస్కరించుకుని పులివెందులలో జగన్ ఇది మొదలు పెట్టారు. మూడున్నరేళ్ల క్రితం వరకూ వైఎస్ పొటోను విపరీతంగా వినియోగించుకుని, ఆ సానుభూతి ఓట్లు దక్కించుకున్న వైసీపీ నాయకత్వం, ఎన్నికల తర్వాత కొద్ది నెలలకే ఆయన నామస్మరణ మానేసింది.
అయితే, నంద్యాల ఉప ఎన్నికలో దారుణ పరాభవం తర్వాత కంగుతిన్న జగన్, పార్టీకి దూరమవుతున్న ముస్లింలు, చీలిక వచ్చిన దళితులను ఎలా దరిచేర్చుకోవాలో సూచించాలని తన కన్సల్లెంట్ పీకేను కోరినట్లు సమాచారం. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను గమనించి, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి సానుభూతి తప్ప, నీ మొఖం చూసి ఎవరూ ఓట్లు వెయ్యరు అని, మళ్లీ వైఎస్ ని వాడుకోవాలని పీకే సలహా ఇచ్చారు.
మిసిడ్ కాల్ చెయ్యకపోతే వదలరు అంట, శిక్షణ పొందిన నాలుగున్నర లక్షల మంది ప్రతి ఇలూ తట్టి ఆ కుటుంబ సభ్యులను వైఎస్ కుటుంబంలో చేర్చుకోవాలని ప్రణాళిక రూపొందించారు. సభ్యత్వ నమోదులో ప్రతి ఇంటి నుంచి ఒకరిని సభ్యులుగా చేర్పించాలని యోచిస్తున్నారు. ఈ విధంగా జగన్ను ప్రజలకు చేరువ చేయాలన్నదే ఈ ప్రణాళిక లక్ష్యంగా కనిపిస్తోంది.
ఇంకెందుకు ఆలస్యం మిసిడ్ కాల్ ఇవ్వండి... ఆయన ఎప్పుడూ సియం అవుతారో, అసలు అవుతారో లేదో తెలీదు కాని, మీ సమస్య మట్టికి, ఆయన సియం అయ్యిన వెంటనే పరిష్కరిస్తారు అంట..... నమ్మండి....