పవన్ కళ్యాణ్ ఏంటి చెన్నై ఏంటి అనుకుంటున్నారా ? అంతే మరి, వీడి చర్యలు ఊహాతీతం అనే డైలాగ్ అందుకే పెట్టారేమో. తెలంగాణా ఎన్నికల్లోనే పోటీ చెయ్యలేను అని చేతులు ఎత్తేసిన హీరో గారు, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పటానికి వస్తున్నారంటూ లీకులు ఇస్తున్నాయి జనసేన వర్గాలు. ఈ నేపధ్యంలో, పవన్ బుధవారం చెన్నైలో పర్యటించనున్నారు అని ఒక ప్రెస్ నోట్ విడుదల చేసారు. అక్కడ ఆయన కీలక ప్రకటన చేస్తారని పార్టీ ముఖ్యనేతలు కొందరు ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి పవన్ మీడియా సమావేశానికి ఒక రోజు ముందు పార్టీ నుంచి ఆహ్వానం వస్తుంటుంది. కానీ 48 గంటలు ముందే ఆయన చెన్నై పర్యటన, మీడియా సమావేశం ఆహ్వానాన్ని పార్టీ వర్గాలు మీడియా సంస్థలకు పంపాయి.
ఈ సమావేశంలో ఆసక్తికరమైన ప్రకటన ఏమైనా ఉంటుంది అంటూ మీడియాకు లీకులు ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ జాతీయ రాజకీయాల పై మాట్లాడతారనే సంకేతాలు ఇస్తూ, ఆ ప్రెస్ నోట్ లో, పవన్ కళ్యాణ్ 2019లో మెగా ప్లన్స్ గురించి మీతో పంచుకుంటారు రండి అంటూ, మీడియాను ఆహ్వానించారు. చెన్నై నుంచి దేశం మొత్తం క్యంపైన్ ఎందుకు చేస్తున్నారో చెప్తారంటూ ప్రెస్ నోట్ విడుదల చేసారు. అయితే.. 21న ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వెళ్లే అవకాశాలున్నాయి. ఆ నేపథ్యంలోనే పవన్ చెన్నైలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఉంటారని రాజకీయ వర్గాలు సందేహం వ్యక్తం చేశాయి. అయితే చంద్రబాబు ఢిల్లీ పర్యటన రద్దు అయ్యింది.
ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఇరుగుపొరుగు రాష్ట్రాల్లోనూ క్రియాశీలంగా వ్యవహరించాలని పవన్ భావిస్తున్నారని.. తన రాజకీయ ఉద్దేశాలను, భవిష్యత్ ప్రణాళికలను తమిళ మీడియాతో పంచుకుంటారని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఇప్పటి వరకూ ఆంధ్రకే పరిమితమైన జనసేనాని.. తొలిసారిగా రాష్ట్రేతర ప్రాంతమైన చెన్నైలో తన మద్దతుదారులతో భేటీ కానున్నట్లు సమాచారం. అదేవిధంగా ఇక్కడి వామపక్ష నేతలతోనూ ఆయన సమావేశమవుతారని తెలుస్తోంది. అయితే తెలంగాణా లాంటి రాష్ట్రంలోనే నా వల్ల కాదు అంటూ చేతులు ఎత్తేసిన పవన్ కళ్యాణ్, దేశ వ్యాప్తంగా చక్రం తిప్పుతారంట. పాపం అమిత్ షా చేతిలో, మరీ రోబో అయిపోయాడు మనోడు. చంద్రబాబు దేశ వ్యాప్తంగా గుర్తింపు, గౌరవం ఉంది కాబట్టి ఆయనకు స్పేస్ ఉంటుంది కాని, అసలు ఎవరో తెలియని పవన్ కళ్యాణ్ దేశ రాజకీయాల్లోకి వస్తే, మొన్న మాయావతి ఏమి చేసిందో, అదే రిపీట్ అవుతుంది. అయినా పవన్ చేతిలో ఏముంది, అంతా అమిత్ షా మాయ...