పవన్ కళ్యాణ్ కి, బీజేపీ పార్టీకి ఉన్న లోపాయికారీ ఒప్పందం అందరికీ తెలిసిందే... మార్చ్ 2018 వరకు మోడీని, బీజేపీని తప్పు పట్టిన పవన్, కొన్ని విపత్కర పరిస్థితుల్లో అమిత్ షా కి లొంగిపోయిన సంగతి తెలిసిందే. ఆ రెండు అమిత్ షా దగ్గర ఉండటంతో, పవన్ కళ్యాణ్, అమిత్ షా ఏది చెప్తే అది చెయ్యాల్సిన పరిస్థితి.అందుకే బీజేపీని ఒక్క మాట కూడా అనకుండా, కేవలం చంద్రబాబుని మాత్రమే టార్గెట్ చేస్తూ, చంద్రబాబు జాతీయ స్థాయిలో చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వకుండా, బలహీన పరిచే కుట్రలు చేస్తున్నాడు. అయితే, ఎప్పుడూ బీజేపీ పై డైరెక్ట్ గా మాట్లాడని పవన్, నిన్న బీజేపీ పై డైరెక్ట్ కామెంట్స్ చేసారు.
బీజేపీ హిందువుల పార్టీ కాదని... ఒక రాజకీయ పార్టీ అని పవన్ పేర్కొన్నారు. కాకినాడలో మంగళవారం ముస్లింలతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయ న మాట్లాడారు. ‘దేశంలో ద్వితీయశ్రేణి పౌరులుగా అభద్రతాభావంతో జీవిస్తున్నాం. ముస్లింల మనోభావాలను దెబ్బతీస్తున్న బీజేపీతో జనసేన బంధంపై ఒక ప్రకటన చేయాలి’ అని జవహర్ అలీ అనే న్యాయవాది పవన్‌ను కోరారు. దీనిపై పవన్ స్పందిస్తూ... ‘‘బీజేపీ అనేది హిందువుల పార్టీ కాదు.. అదొక రాజకీయపార్టీ. బీజేపీకి మద్దతు ఇచ్చినప్పుడు... ఆ పార్టీ సంఘ్‌తో ఉంటుందని చాలామంది చెప్పారు.
అలాగైతే ఈ దేశంలో ఎవ్వరితోనూ దోస్తీ చేయలేం. ఇదే టీడీపీ గోద్రా అల్లర్ల సమయంలో మోదీని విమర్శించింది. ఆ తర్వాత మళ్లీ చేతులు కలిపింది. ప్రాంతీయ పార్టీలు వాటిలో ఏదో ఒకదానితో కలవాల్సిందే. జనసేనను బీజేపీలో విలీనం చేస్తే మీరు భయపడాలి’’ అని తెలిపారు. అయితే రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం, ఆశ్చర్యపోతున్నారు. మన పార్టీ గురించి, మనం కూడా ఎప్పుడూ ఇలా చెప్పుకోలేదు, మన పార్టీని హిందుత్వ పార్టీ అని అందరూ అంటుంటే, మనం ఎప్పుడూ ఖండించలేదు, పవన కళ్యాణ్ మన తరుపున కూడా మాట్లాడుతున్నాడు, ఒంటి చేత్తో ఎన్నో బాధ్యతలు పవన్ మోస్తున్నాడు అంటూ, ప్రశంసలు కురిపించారు.