రాష్ట్ర సమస్యల కోసం, ఎవరితో అయినా కలిసి పని చేస్తా అని బిల్డ్ అప్ లు... కట్ చేస్తే, కేంద్రం పై పోరాటం చెయ్యాలి అంటేనే వణుకు... జానాల మధ్యకు వచ్చి, ఎదో పిచ్చ పట్టినట్టు ఊగుతాడు, ఎందుకు ఊగుతాడో తెలీదు.. మోడీ అనే మాట, నోటిలో నుంచి వచ్చి, కొన్ని నెలలు అయ్యింది. బీజేపీకి ఇబ్బంది అనుకున్న ప్రతిసారి వచ్చి హడావిడి చేస్తాడు. చంద్రబాబు తన పుట్టిన రోజున ధర్మ పోరాట దీక్ష చేస్తుంటే, అర్ధరాత్రి ట్వీట్లు మొదలు పెట్టాడు. వారం ముందు తన తల్లిని ఎవరో ఒక సినిమా ఆక్టర్ ఎదో అంటే, వారం తరువాత, ఆ విషయాన్ని చంద్రబాబుకి ముడి పెట్టి, వరుస ట్వీట్లు మొదలు పెట్టాడు.. విశాఖలో ధర్మ పోరాట సభ అంటే, హడావిడి చేసాడు... కడపలో ఉక్కు పరిశ్రమ కోసం దీక్ష అంటే, ఎప్పుడో అయిపోయిన, శ్రీ వారి నగల గురించి, రమణ దీక్షితులు చెప్పే అబద్ధాల గురించి, ట్వీట్లు మొదలు పెట్టాడు.. ఇవన్నీ కేంద్రం పై పోరాటం చేస్తున్న వారికి ప్రజల్లో ఫోకస్ రాకుండా చేసే, నీఛమైన దిగజారుడు చర్యలు...
నిన్న మరింత ముందుకు వెళ్ళాడు.. జగన్ మోహన్ రెడ్డి లాగా సిగ్గు అనేది పూర్తిగా వదిలేసాడు... ఒక పక్క కడప ఉక్కు పై 6 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తుంటే, వారికి కనీస మద్దతు ప్రకటించలేదు. సరే, ప్రకటించక పోగా, తెలుగుదేశం పార్టీ వల్లే ఉక్క పరిశ్రమ రావటం లేదని, కేంద్రం తప్పు లేదంటూ, దిగజారిపోయి మాట్లాడుతున్నాడు.. ఇపుడు ఉక్కు పరిశ్రమ కోసం గోల చేస్తున్న టీడీపీ నేతలే ఒకప్పుడు దాన్ని అడ్డుకున్నారు అంటూ, బోడి గుండుకి మోకాలుకి ముడి పెడుతున్నాడు.. అప్పట్లో రాజశేఖర్ రెడ్డి, గాలి జనార్ధన్ రెడ్డి కలిసి బ్రాహ్మిణి స్టీల్స్ తో చేసిన అరాచాకాన్ని తెలుగుదేశం ఒక్కటే కాదు, పవన్ పక్కన ఉన్న కమ్యూనిస్ట్ లు కూడా అడ్డుకున్నారు. అది ప్రైవేటు సంస్థ... ఇప్పుడు మనకు, కేంద్రం వచ్చి ఉక్కు పరిశ్రమ పెట్టాలి... ఆ మాత్రం కూడా అవగాహన లేకుండా, బీజేపీ, జగన్ పన్నిన పన్నాగం ప్రకారం, ఉక్కు పరిశ్రమను, గాలి జనార్ధన్ రెడ్డికి ఇవ్వమంటావా పవన్ ?
అంతే కాదు మరో కామెడీ విషయం కూడా చెప్పాడు... రోడ్డు వెంట పిట్టల దొరలు చెప్పే కబురులు లాగా... జిందాల్ సంస్థ, కడపలో తాము ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు సిద్ధమని తనతో చెప్పింది అంట... నువ్వు ఎవడివి, నీకు చెప్పటానికి ? ఒక రోజు బయట ఉంటే, నెల రోజులు ఫార్మ్ హౌస్ లో ఉండేవాడివి, అయినా నీ అర్హత ఏంటి అంటే, జిందాల్ సంస్థ నీతో చెప్తుంది ? చెప్తే కేంద్రంతో, లేకపోతే రాష్ట్రం ప్రభుత్వంతో చెప్తుంది.. అంతే కాదు, రాష్ట్రంలో పరిశ్రమ రావాలి అంటే, పెర్సెంటేజ్ ఇవ్వాలి అంట, అందుకే భయపడిపోయి పరిశ్రమలు రావటం లేదంట... ఈ విషయం విదేశాలకు వెళ్ళినప్పుడు, తనతో వచ్చి పారిశ్రామకవేత్తలు చెప్పారంట... ఏంటి అండి ఇది ? ఇదేమన్నా త్రివిక్రమ్ సినిమాలో స్క్రిప్ట్ అనుకుంటున్నాడా ? అందరూ వచ్చి ఈయనకే చెప్తారు, ఇదేమి కామెడీనో ఏంటో ? కియా, అశోక్ లేల్యాండ్, హీరో, గమేషా, సెల్కాన్, ఫాక్ష్కాన్, ఇవన్నీ ఎలా వచ్చాయి ? కేంద్రాన్ని సమర్ధించటం కోసం, ఉక్క పరిశ్రమ విషయంలో కేంద్రం పై నిందలు రాకుండా ఉండటం కోసం, ఇన్ని అబద్ధాలు, ఒక 10 నిమషాల ప్రెస్ మీట్ లో మాట్లాడాడు... జగన్ కు పోటీగా, దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడు.. జగన్ అంటే కేసుల కోసం లొంగిపోయాడు.. మరి ఇతగాడు, ఎందుకు, దేనికి, ఏ పెన్ డ్రైవ్ కు లోంగాడో, ఆ అమిత్ షా కే తెలియాలి...