రాజనగరం సమీపంలో రోడ్డు ప్రమాదంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కి జరిగిన ప్రమాదంలో నలుగురు బౌన్సర్లతో పాటు, తొమ్మిది మంది గాయపడ్డారు. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న పవన్ రాజానగరం బహిరంగ సభలో పాల్గొనేందుకు వెళ్తుండగా రంగంపేట వద్ద ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మొత్తం తొమ్మిది మంది గాయపడినట్టుతెలుస్తుంది. అయితే, ముగ్గురిని మాత్రం వెంటనే ఆసుపత్రికి తరలించారు. చిన్నపాటి గాయలు కావడం, ప్రాణాపాయం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి అతి వేగమే కారణం అని తెలుస్తుంది. కాన్వాయ్ లో ఉన్న 4గురు బౌన్సర్లకు గాయాలు జిఎస్సెల్ ఆస్పత్రికి తరలించారు.
రంగంపేట శివారున పవన్ కల్యాణ్ కాన్వాయ్ వేగంగా వెళ్తున్న టైములో, ఆయన సెక్యూరిటీ వాహనం వేగంగా వచ్చి లారీ ఢీకొనడంతో సెక్యూరిటీ సిబ్బందికి గాయాలు అయ్యాయి. జిఎస్ఎల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సిబ్బంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మరో పక్క పవన్ కళ్యాణ్ తూర్పుగోదావరీ మదురుపూడి విమానశ్రయానికి చేరుకున్నారు. ఇండిగో విమానంలో హైదరాబాద్ బయలుదేరి వెళ్ళిపోయారు. గతంలో కూడా శ్రీకాకుళం పర్యటనలో, పవన్ ప్రయాణిస్తున్న కారు, ఒక బాలుడు పై నుంచి వెళ్ళటంతో, తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రాణా పాయం తప్పటంతో, అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు కూడా అతి పెద్ద ప్రమాదం తప్పింది.
మరో పక్క నిన్న, విపక్ష నేత జగన్‌పై జనసేన అధిపతి పవన్ కల్యాణ్ తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. బుధవారం తూర్పు గోదావరి జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడలో జరిగిన బహిరంగ సభలో పవన్ ప్రసంగించారు. "జగన్ మోహన్‌రెడ్డి ఏమైనా సురవరం ప్రతాప రెడ్డా, తరిమెల నాగిరెడ్డా, రావి నారాయణరెడ్డా, పుచ్చలపల్లి సుందరరామి రెడ్డా, పుచ్చలపల్లి రామచంద్రా రెడ్డా. వాళ్లంతా జైలుకెళ్లారు. జగన్ కూడా జైలు కెళ్లారు. అంతామాత్రాన వారికీ, జగన్‌కూ పోలిక లేదు’’ అని పవన్ వ్యాఖ్యానించారు. వారంతా జనం కోసం జైలుకు వెళ్లగా... జగన్ అవినీతి చేసి జైలుకు వెళ్లారని పరోక్షంగా చెప్పారు.