మనం ఎన్నో నిరసనలు చూసాం... రిలే నిరాహార దీక్షలు విన్నాం, కాని రిలే పాదయత్రలు ఎప్పుడైనా విన్నామా ? గంట సేపు పాదయత్ర అనే కొత్త కాన్సెప్ట్ తో, కమ్యూనిస్ట్ లు, జనసేన పార్టీ ఈ రోజు విజయవాడలో కదం తొక్కారు... బెంజిసర్కిల్ నుంచి రామవరప్పాడుకి పాదయాత్ర చేసి, స్టార్ హోటల్ లో ప్రెస్ మీట్ పెట్టారు, జనసేన పవన్ కళ్యాణ్, సీపీఎం కార్యదర్శి మధు, సీపీఐ కార్యదర్శి రామకృష్ణ.. పాపం, బెజవాడ ఎండలు ఎలా ఉంటాయో తెలిసి ఉండదు, అందుకే రొప్పుతా రొప్పుతా మూడు కిలో మీటర్లు నడిసారు... సీపీఎం కార్యదర్శి మధు అయితే ఎండకు తట్టుకోలేక చొక్కా కూడా విప్పేసి, నిడిచారు... పాపం, ఈ బెజవాడ ఎండ దెబ్బకు, ముగ్గురికి మైండ్ పోయినట్టు ఉంది... మీడియా సమావేశం పెట్టి, ఏమి చెప్పారో చూడండి...

pk 06042018 2

ముందుగా, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ దగ్గరకు వద్దాం... ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఢిల్లీ పర్యటనతో ఎలాంటి ఉపయోగం లేదంట, పార్లమెంట్‌ సెంట్రల్‌హాల్‌లో కాఫీ తాగి వచ్చారంత... చంద్రబాబుకి చిత్తశుద్ధి లేదంట... ఇక సీపీఎం నేత మధు దగ్గరకు వద్దాం, ఈ రోజు వీళ్ళు చేసిన రిలే పాదయాత్రతో మోడీ భయపడి పోయారు అంట... పోరాటం అంటే ఇలా చెయ్యాలి ఆంట.. చంద్రబాబు చేసేది పోరాటమే కాదు అంట, అందుకే, శనివారం ప్రభుత్వం నిర్వహించే అఖిలపక్ష సమావేశానికి హాజరుకాబోమని మధు స్పష్టం చేశారు.

pk 06042018 3

ఇక మన హీరో గారి దగ్గరకు వద్దాం... ఇక్కడ ఈయన ఏమి చెప్తున్నాడో ఆయనికే అర్ధం కాదు... ఈ రోజు అయితే, బెజవాడ ఎండ దాటికి పూర్తిగా బాలన్స్ తప్పాడు.. మొన్నటి దాకా తెలంగాణా తరహ పోరాటం చెయ్యాలి అన్నాడు... ఈ రోజు, అఖిలపక్ష సమావేశం కోసం నన్ను ఆహ్వానించారు అని, కాని ఇప్పుడు మాత్రం అఖిలపక్ష మీటింగ్ వల్ల ఇప్పుడు ఏం లాభమో తనకు అర్థం కావడం లేదని, వెళ్లి కాఫీ, టీలు తాగి రావడం తప్ప ఏం చేస్తామని అంటున్నాడు పవన్... ఇంకా వింత ఏంటి అంటే, చంద్రబాబుకి క్లారిటీ లేదు అంట... ఏమి చేస్తున్నాడో ఆయనికే తెలియటం లేదు అంట... కాబట్టి ముందు చంద్రబాబు ఒక క్లారిటీ తెచ్చుకుని, తన దగ్గరకు మంత్రులని పంపిస్తే, అప్పుడు చంద్రబాబుకి క్లారిటీ ఉందో లేదో తెలుసుకుని, అప్పుడు అఖిలపక్షం పై స్పందిస్తాడంట పవన్... తాను జేఎఫ్‌సీ పెట్టబట్టే, చంద్రబాబు పోరాటం మొదలు పెట్టారంట... అవిశ్వాసం కూడా ఆయన అన్ని పార్టీలకు సందేశాలు ఇవ్వబట్టే, అందరూ మద్దతు ఇచ్చారంట...

అసలు పవన్ కళ్యాణ్ కు ఎంత క్లారిటీ ఉందో ఒక చిన్న ఉదాహరణ... అఖిలపక్షానికి మీరెందుకు వెళ్లరు అని విలేకరులు అడిగితే, పవన్ స్పందిస్తూ 'ముఖ్యమంత్రి..అసలు హోదా మీద..ఎలా ముందుకెళ్లాలనుకుంటున్నాడు అనేది మాకు తెలియచేసినట్టయితే..అఖిలపక్షానికి వెళ్లే వాడిని" అని సమాధానం ఇచ్చారు... దానికి విలేకరి స్పందిస్తూ, "అది తెలియచెయ్యటానికేగా అఖిలకపక్షం అని పెట్టి అందరినీ రమ్మంది" అని చెప్పారు... దీనికి పవన్ స్పందిస్తూ "అంటే..అదీ.. ఆ.. అఖిల పక్షం రెండు సంవత్సరాల క్రితం పెట్టుంటే బాగుండేది" అని బదులు ఇచ్చారు... ఇది బెజవాడ ఎండల ఎఫెక్ట్... ఈయనకు పిచ్చ క్లారిటీ ఉంది అంట, చంద్రబాబుకి క్లారిటీ లేదు అంట... ఇంకా ఏమి మాట్లాడతాం...

Advertisements

Advertisements

Latest Articles

Most Read