పవన్ కళ్యాణ్ డైలమాలో ఉన్నారు. చంద్రబాబుని ఓడించాలానే టార్గెట్ ఇచ్చిన అమిత్ షా ఆదేశాలు ఫాలో అవుతూనే, నెక్స్ట్ ఏంటి అనేది ఆలోచిస్తున్నాడు. జగన్ తో కలిసి, పవన్ ఎన్నికలకు వెళ్ళాలి అనేది అమిత్ షా వ్యూహం. అయితే ఇది పవన్ కళ్యాణ్ కు ఒకే అయినా, తనకు వచ్చే లాభం ఏంటి అనేది ఆలోచిస్తున్నాడు. ఒకవేళ చంద్రబాబు ఓడిపోతే, జగన్ ముఖ్యమంత్రి అవుతాడు నాకేంటి అని పవన్ ఆలోచనలో పడ్డారు. పొత్తుల విషయం, మొత్తం అమిత్ షా నిర్ణయం పైనే ఆధారపడి ఉన్నా, జనసేన పార్టీలో కూడా ఇప్పుడు పొత్తులపై మాటామంతీ కొనసాగుతోంది. జగన్ తో పొత్తు పెట్టుకుని వెళ్తే, భవిషత్తు ఏంటి ? మనం సొంతగా వెళ్తే, ఎలా ఉంటుంది అనే చర్చ మొదలైంది. ఏది ఏమైనా, ఎవరితో ఏమి కలిసినా, చంద్రబాబుని దించాలనే టార్గెట్ పెట్టుకున్నా, పదవి పై మాత్రం పవన్ కు భారీగా ఆశలు ఉన్నాయని అంటున్నారు.
"2014 నాటి ఎన్నికల్లో మద్దతు ఇచ్చి తెలుగుదేశాన్ని అధికారంలోకి తీసుకువచ్చాం. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి ఆ పార్టీని అధికారంలోకి తీసుకువస్తే.. ఇక మనం ఎప్పుడు ఎదగాలి?'' అని జనసేన నేతలు కొందరు పవన్‌కల్యాణ్ వద్ద వాదన లేవదీశారని తెలిసింది. పైగా వైసీపీకి మద్దతిస్తే.. జగన్ గనుక సీఎం పీఠం ఎక్కితే వచ్చే టర్మ్ కూడా మనకి కష్టమవుతుందనీ, మనకి ప్రతిపక్ష పాత్రే మిగులుతుందనీ కొందరు జనసేన నేతలు వాదిస్తున్నారు కూడా. స్వయంగా పోటీచేసి సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు కైవసం చేసుకుంటే కర్నాటకలో జేడీఎస్ మాదిరిగా ఏపీలో చక్రం తిప్పవచ్చునన్నది మెజారిటీ జన సైనికులు, పార్టీ నేతల వాదనగా ఉంది.
ఈ వాదనపైనే ఇప్పుడు జనసేనలో చర్చోపచర్చలు సాగుతున్నాయి. పవన్ కూడా ఒంటరిగా పోటీ చేసి, కుమారస్వామి లాగా జాక్ పాట్ కొడదాం అనుకుంటున్నా, ఆయన చేతిలో ఏమి లేదు. అంతా అమిత్ షా ఇష్ట ప్రకారం జరగాలి. ఇటీవల విజయవాడలో జనసేన రాష్ట్ర కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా జనసేన అధినేత పవన్‌కల్యాణ్, ఆ పార్టీ మరో సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్భంగా కొంతమంది మీడియా ప్రతినిధులు రాబోయే ఎన్నికలలో వైసీపీతో పొత్తు పెట్టుకుంటారా అని పవన్‌ని ప్రశ్నించగా, "తర్వాత మాట్లాడదాం'' అంటూ దాటవేశారు.