ఒక మిస్డ్ కాల్ ఇవ్వండి, నేను ఎప్పుడు ముఖ్యమంత్రి అయితే, అప్పుడే మీ సమస్య తీరుస్తా అంటూ, కిరాయికి వచ్చిన ప్రశాంత్ కిషోర్ సలహా మేరకు, జగన్ ఈ కార్యక్రమం మొదలు పెట్టాడు... ఈ మిస్డ్ కాల్ కార్యక్రమం సూపర్ హిట్ అయ్యింది అంటూ, వైఎస్ఆర్ పార్టీ ప్రకటించింది... ఇప్పటికి వరకు 47 లక్షల మంది మిస్డ్ కాల్ ఇచ్చి సమస్యలు చెప్పారని చెప్పింది..

అయితే, ఇక్కడ కూడా పీకే ఫేక్ బ్యాచ్, జగన్ పైడ్ బ్యాచ్ పోటా పోటీగా పని చేసి, ఈ కార్యక్రమం కూడా ఫేక్ చేసి పెట్టాయని తెలుగుదేశం ఐటి వింగ్ ఆరోపిస్తుంది...

లక్షలమంది మిస్డ్ కాల్స్ ఇచ్చి మరీ వైసీపీలో చేరుతున్నారని డప్పు కొట్టడం వెనుక ఉన్న నిజం ఏంటి? ఫోన్ స్పూఫింగ్ టెక్నాలజీ గురించి విన్నారా ? మీ ఫోనులోనుండే మీరు మీకిష్టమొచ్చిన నంబర్‌తో ఎవరికయినా ఫోన్ చేయవచ్చు. అవతలి వ్యక్తికి కాలర్ ఐడీలో మీ నంబర్ బదులు మీరు వాడిన దొంగ నంబర్ డిస్‌ప్లే అవుతుంది. సింపుల్‌గా ఒక స్మార్ట్ ఫోన్లో ఈ యాప్ ( అప్లికేషన్) డౌన్‌లోడ్ చేసుకుంటే దాంట్లో నుండి మీరు ప్రధానమంత్రి మొబైల్‌నుండి ఫోన్ చేస్తున్నట్లు కూడా అవతలి వాళ్ళని మభ్య పెట్టవచ్చు.

ఈ టెక్నాలజీ ద్వారా, పీకే ఫేక్ బ్యాచ్, జగన్ పైడ్ బ్యాచ్, దీనికోసమే పనిచేస్తోందని తెలుగుదేశం ఐటి వింగ్ చెప్తుంది. సిమ్‌కార్డుల షాపులు, గ్యాస్ ఏజెన్సీలు, డ్వాక్రా గ్రూపులు, ప్రైవేట్ ట్రావెల్స్, షాపింగ్ మాల్స్ ...ఇలా ప్రజల మొబైల్ ఫోన్ నంబర్ల డేటాబేస్‌ని ఈ ఫేక్ బ్యాచ్ సేకరించి, లిస్టు తమ ముందు పెట్టుకుని, స్పూఫింగ్ ద్వారా ఆ లిస్టులో ఉన్న మీలాంటి వ్యక్తుల ఫోన్ నంబర్లతో 9121091210 కి తామే మిస్డ్ కాల్స్ ఇచ్చుకుంటున్నారట.

రికార్డుల్లో మీ నంబర్‌ నుండే ఫోన్ వచ్చినట్లుగా కనబడుతుంది. తర్వాత వైఎస్సార్ కుటుంబానికి స్వాగతం ఫ్రం జగన్ అన్న, అని మీకు కాల్ వస్తే బిత్తర పోవడం మీ వంతు అవుతుంది...

ఇలా సర్వం ఫేక్ చేసే ఈ రెండు బ్యాచ్లకి టార్గెట్ ఇచ్చారు అంట... ఎవరు తక్కువ టైంలో, ఎక్కువ ఫేక్ చేస్తే, వారికి దీపావళి బోనస్ కూడా ప్రకటించారని లోటస్ పాండ్ టాక్... ఇది "వైఎస్సార్ కుటుంబం" కార్యక్రమం తీరు...

Advertisements

Advertisements

Latest Articles

Most Read