జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ రోజు అమరావతి ప్రాంతంలో పర్యటించారు. రాష్ట్ర ప్రభుత్వం అమరావతి పై గందరగోళ ప్రకటనల నేపధ్యంలో, అక్కడ రైతులు , వారం రోజుల క్రిందట వచ్చి పవన్ కళ్యాణ్ ను కలిసారు. వారి అభ్యర్ధన మేరకు, ఈ రోజు పవన్ కళ్యాణ్ అమరావతిలో పర్యటించి, రైతుల నుంచి, వారి ఇబ్బందులు, ప్రభుత్వ ప్రకటన పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అయితే అమరావతి పర్యటనకు వచ్చిన పవన్ కళ్యాణ్‌కు ఆయన అభిమాని ఊహించని గిఫ్ట్ ఇచ్చారు. నిడమర్రు గ్రామంలో పవన్ కళ్యాణ్ పర్యటన ప్రారంభించగానే, ఓ అభిమాని వచ్చి పవన్ కు ఒక జత చెప్పులు బహూకరించారు. మొదటిసారి తమ గ్రామానికి వచ్చారని, ఈ చిన్న కానుక స్వీకరించాలని కోరారు. అమరావతి రాజధాని నేల పై ఈ చెప్పులతో నడవాలని కోరారు. తన అభిమాని ఇచ్చిన కానుకను స్వీకరించిన పవన్ కళ్యాణ్, అమరావతి పర్యటనలో ఆ చెప్పులు ధరించి పర్యటించి, ఆ అభిమాని కోరిక తీర్చారు.

pk 30082019 2

మరో పక్క ప్రభుత్వం అమరావతి పై చేస్తున్న గందరగోళ పరిస్థితి పై పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ అనిశ్చితి తొలగించి, జగన మోహన్ రెడ్డి స్వచ్చమైన ప్రకటన చెయ్యాలని కోరారు. బొత్సా సత్యన్నారాయణ తన పై అనవసర ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. తాను ఎప్పుడూ అమరావతి వద్దు అని చెప్పలేదని, రైతుల నుంచి భూమి వారి ఇష్టం లేకుండా తీసుకోవద్దు అని మాత్రమే, అప్పట్లో ఆందోళన చేసానని చెప్పారు. ప్రస్తుతం, రాజధాని పై రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చితికి, మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన ప్రకటనలే కారణం అని అన్నారు. బొత్సా ఏమి తెలియకుండా, అన్నీ తెలిసినట్టు చెప్తూ, ప్రజలను తప్పుడు సమాచారం ఇస్తున్నారని అన్నారు. మంత్రి పదవిలో ఉంటూ, అన్నీ తెలుసుకుని మాట్లాడాలని అన్నారు.

pk 30082019 3

ముఖ్యమంత్రులు మారిస్తే రాజధానులు మారుస్తారా అని పవన్ ప్రశ్నించారు. రేపు బొత్స సీఎం అయితే రాజధాని విజయనగరంలో పెడతారా? అని నిలదీశారు. అమరావతి నిర్మాణానికి అవసరమైన ఖర్చు జగన్‌ తన జేబులో నుంచి ఏమి తీసి ఇవ్వడం లేదని పవన్‌ అన్నారు. హైదరాబాద్‌కు దీటుగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఉండాలని అందరూ అనుకోవాలని అన్నారు. రాజధాని ప్రాంతంలోని తుళ్లూరు, నిడమర్రు, కూరగల్లులో పర్యటించారు. రేపు కూడా పవన్ కళ్యాణ్ అమరావతి పర్యటన కొనసాగనంది. అయితే పవన్ పర్యటన పై వైసీపీ నేతలు రాజకీయ దాడి చేసారు. పవన్ ప్యాకేజీ తీసుకుని, బయటకు వస్తారని, ఆళ్ళ రామకృష్ణా రెడ్డి అన్నరు. పెరుగు అన్నం స్క్రిప్ట్ మర్చిపోయావా అంటూ పవన్ ను ఎద్దేవా చేసారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read