పవన్ అన్నయ్యా......నీ సభల్లో ఆవేశంగా నువ్వు ఏదేదో మాట్లాడడం చూసి నేను కూడా ఏదో ఆవేశంలో ఇలానే ఇంకా ఏదేదో రాసేశా....... తరువాత అనిపించింది అనవసరంగా ఆవేశంలో ఏదో మాట్లాడాను, కాస్త ఆలోచించి మాట్లాడాల్సింది అని..... కానీ ఆలోచించిన తరువాత అనిపిస్తుంది.....నువ్వు ఆంధ్రకి అస్సలు కరెక్ట్ కాదు అనిపిస్తుంది......అసలు నీ సభలు సమావేశాలు చూస్తే ఏముంది కొత్తగా చెప్పడానికి ? అదేమంటే పంచెలూడదీస్తా అంటావ్.......ఎవరి పంచెలు వాళ్ళు ఊడదీసుకోలేరా? అందరి పంచెలు నువ్వేవచ్చి ఊడదీయాలా? నీ ప్యాంటుజిప్పు పెట్టుకోడమే నీకు సరిగారాదు......ఏ సినిమాలో చూసినా ప్యాంటు మీద ప్యాంటు వేసుకొని జిప్పు పెట్టుకోకుండా అదే ఫ్యాషన్ అంటావ్.......అవంటే సినిమాలు కాబట్టి సరిపోయింది.....కానీ ఇది ఒక రాష్ట్ర భవిష్యత్తు.....
కాబట్టి అసలు నువ్వు రాజకీయాల్లోకి ఎందుకొచ్చావ్? నీ లక్ష్యాలేమిటి? రైతులకి నువ్వేం చేస్తావ్? పేద ప్రజలకి ఏం చేస్తావ్? రాజధాని కూడా లేని రాష్టానికి నువ్వేం చేయగలవు.....ఇలాంటి వాటి గురించి చెప్పకుండా బహిరంగ సభల్లో నీ ఎదవసోధి మాకెందుకు చెప్పు? లేదంటే తోలు తీస్తా..... తాట తీస్తా అంటావ్....నువ్వేదో మటన్ కొట్టు మస్తాన్ లాగ.......నువ్వు తోలు తీస్తే, ఎదుటి వాడు చూస్తూ కూర్చుంటాడా, వాళ్ళు తీయలేరా? నీకంటే చదువులేదు కాబట్టి తెలియదులే....ఏదో పరిపక్వతలేక ఆలా మాట్లాడావ్ అనుకుందాం.....కానీ నిన్ను చూసి నీ అభిమానులు కూడా అలానే మాట్లాడుతుంటే ఆంధ్ర రాష్ట్రప్రజలు కూడా తెలంగాణాలో కేసీఆర్ , ఇక్కడ నువ్వు మాట్లాడే బూతులే మన అధికారభాష అనుకునే ప్రమాదం వుంది......కానీ ఇది తప్పు పవన్.......మనతో ఏవిధమైన రక్త సంభంధం అనేదిలేకుండా, ఏ కల్మషం లేకుండా మనల్ని నమ్ముతున్న అభిమానాన్ని డబ్బుకోసం అమ్ముకుంటున్నావ్ ......ఇది మోసం.....నమ్మక ద్రోహం అనిపించడం లేదా?
వర్షాలు పడి కాల్వలకు నీళ్లు రాగానే పంటలకు సీజన్ మొదలయినట్లు ఎలక్షన్స్ కి ఒక సంవత్సరం ముందు నుంచి మీ అన్నదమ్ములకు వసూళ్ల సీజన్ మొదలవుతున్నట్లుంది....... అప్పట్లో మీ అన్న టిక్కెట్లు అమ్మి కోట్లు వసూలు చేసి, తరువాత వందలకోట్లకి పార్టీనికూడా అమ్మి మంత్రి పదవి ఒకటి ఆయనకి ఉంచుకున్నాడు.....మంత్రిగా మీ అన్న ప్రజా ప్రయోజనం కోసం చేసిన ఒక్క పని గుండెమీద చెయ్యేసుకొని చెప్పమను? ఇప్పుడు నీకు టైం వచ్చింది....నువ్వు వసూళ్ళు మొదలుపెట్టావ్......దీన్ని ఎవరూ అడ్డుకోకుంటే మళ్ళీ ఎలక్షన్స్ టైంకి మీ అన్నకొడుకులో ఎవరోఒకరు మీలాంటి నాటకాలు మొదలెడతారు.....మీకు ఇదో కుటుంబ వ్యాపారమయిపోయింది నలుగురిని మంచి బాట లో నడిపించాల్సిన నాయకుడే ఇలా ఉంటే ఇంకా ఆ పార్టీ ఎలా ఉంటుందో ఊహించొచ్చు.......నువ్వు మాట్లాడే మాటలు పేపర్లలో, టీవీల్లో చూస్తూనే వున్నాం.......రాష్ట్రానికి పెట్టుబడులు కావాలి.....రాజధాని అభివృద్ధి చెందాలి......పరిశ్రమలు కావాలి.......కొత్త ఉద్యోగాలు రావాలి........సాఫ్ట్ వేర్ కంపెనీలు రావాలి....మన రాష్ట్ర యువత తనకాళ్లమీద తాను నిలబడాలి...... ఇవన్నీ నీలాంటి వ్యక్తికి కనీసం ఊహించడానికి కూడా కష్టతరమైన బాధ్యతలు.......ఎంతో ఓర్పు కావాలి.........నేర్పు కావాలి......చాణక్యత కనబరచాలి......చాతుర్యం ప్రదర్శించాలి .......ఎక్కడ నెగ్గాలో...ఎక్కడ తగ్గాలో తెలిసుండాలి.......అసలు ఇవన్నీ తెలుసుకునేంత పరిణితికూడా నీకులేదు.......ఇవన్నీ నీకు ఉన్నాయని ఇన్నాళ్ళు భ్రమల్లో ఉంచని మాకు, తగిన బుద్ధి చెప్పావ్... కాబట్టి ప్రియమైన పవన్ అన్నయ్యా..... మమ్మల్ని ప్రతి సారి మీ ఫ్యామిలీ నుంచి ఎలక్షన్ కి ఒకడు వచ్చు, మార్చి మార్చి, బకరాలు చెయ్యకండి.. రాజకీయాల్లో నువ్వు ఇప్పటిదాకా సంపాదించుకున్నది చాలు....సైడయిపో......