మొన్నటి దాక, పవన్ కళ్యాణ్ అభిమానులు, జగన్ మోహన్ రెడ్డిని తిట్టే వారు. జరిగిన సంఘటన ఏదైనా, ఎప్పుడు శవాలు కనిపిస్తాయా, ఎప్పుడు వెళ్లి ఓదార్పు చేసి రాజకీయం చేద్దామా అని హేళన చేసారు. అయితే, ఇప్పుడు మారిన పరిస్థితుల్లో, పవన్ కళ్యాణ్ కూడా అదే ఫాలో అవుతున్నారు. జరిగిన సంఘటన ఏంటి ? అది ప్రమాదమా, నిర్లక్ష్యమా అనేది చూడకుండా, ఏది జరిగినా చంద్రబాబుని తప్పు పట్టటం, ఇదేనా నీ నలభై ఏళ్ళ అనుభవం అని ఎగతాళి చెయ్యటం, పవన్ కళ్యాణ్ కు ఫ్యాషన్ అయిపొయింది. మూడు రోజుల క్రితం, కర్నూల్ జిల్లాలో ఆలూ రు మండలం హత్తిబెళగల్ సమీపంలోని విఘ్నేశ్వర క్వారీ క్రషింగ్ యూనిట్‌లో జరిగిన పేలుడు గురించి తెలుసుకోవటానికి పవన్ వచ్చారు.
ప్రతిపక్ష నేతగా, పవన్ కు ఆ హక్కు ఉంటుంది ఎవరూ కాదనరు. బాధితులకు అండగా ఉండాలి, ఎందుకు ప్రమాదం జరిగింది, మరోసారి జరగకుండా ఏమి చెయ్యాలని చెప్తే ఎవరికీ ఇబ్బంది ఉండదు. కేవలం రాజకీయం చెయ్యటం కోసం, ప్రమాదాలని కూడా, చంద్రబాబు అనుభవాన్ని ఎగతాళి చెయ్యటం కోసం, చేస్తే అది అభ్యంతరకరం. ఇన్ని మాటలు చెప్పే పవన్ కళ్యాణ్, తన అభిమానులని మాత్రం కంట్రోల్ చేసుకోలేడు. ఇతను ఏమి చెప్తున్నాడో, వాళ్ళు ఏమి చేస్తారో కాని, గంతకు తగ్గ బొంత అన్నట్టు తయారయ్యింది పరిస్థితి. కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో, ఈ పేలుడులో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు, పవన్.
పవన్ ఆస్పత్రికి వచ్చిన తరుణంలో ఆయన అభిమానుల అత్యుత్సాహం రోగులకు ప్రాణసంకటమైంది. అభిమానులు ఆస్పత్రి గోడలు, కిటికీలు, భవనాలపైకి ఎక్కారు. ఏకంగా అత్యవసర రోగులకు సరఫరా చేసే ఆక్సిజన్ గొట్టాలను కూడా పట్టుకుని ఎక్కి వాటిని విరగొట్టారు. ఆ సమయంలో సూపర్ స్పెషాలిటీ బ్లాక్‌లో రోగులు వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. విరిగిన పైపులను గుర్తించిన అధికారులు హడావుడిగా మరమ్మతులకు పూనుకున్నారు. ప్రధాన ట్యాంక్ నుంచి విడుదలయ్యే ఆక్సిజన్ వృథాగా పోకుండా కొంతసేపు సరఫరాను బంద్ చేయాల్సి రావడంతో వెంటిలేటర్‌పై ఉన్న రోగులకు కొంత ఇబ్బందిగా మారింది. అంతకుముందు.
ఆ సమయంలో హాస్పిటల్ వర్గాలు, జరిగినదానికి గమనించాయి కాబట్టి సరిపోయింది, లేకపోతే ఐసియులో ఉన్న వారందరూ చనిపోయే వారు. బాధ్యత లేని వ్యక్తులు అభిమానులుగా ఉంటే, సమాజంలో ఇలాంటి అనర్ధాలే జరుగుతాయని, అక్కడ ఉన్న సీనియర్ డాక్టర్ అన్నట్టు, జాతీయ పత్రికలో వచ్చిన కధనంలో పెర్కున్నారు. ఇంత హంగామాగా పవన్ రావలసిన అవసరం ఏముంది ? తన ఫాన్స్ ను , రావద్దు అని చెప్పలేడా ? ఎమర్జెన్సీ ఉన్న చోట, ఇలాగేనా ప్రవర్తించేది అంటూ, ఆ సీనియర్ డాక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. హాస్పిటల్ లోకి వచ్చి, కాబోయే సియం పవన్ అంటూ, అభిమానాలు పెద్దగా అరిచారాని, ఇలాంటి పోకడలు, హాస్పిటల్స్ లో చెయ్యటం మంచింది కాదని ఆయన అన్నారు.