ఇప్పటి దాక ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు, ఫోటోలు, వీడియోలు మార్ఫింగ్ చేసి, ప్రజలను అదే నిజం అని నమ్మించే లోటస్ పాండ్ పైడ్ ఆర్టిస్ట్ బ్యాచ్ లని చూసాం... ఇప్పుడు, 250 కోట్లు ఇచ్చి తెచ్చుకున్న బీహార్ గ్యాంగ్ కూడా లోకల్ జఫ్ఫా గాళ్ళకి తోడైంది... సిగ్గు ఎగ్గు లేకుండా, మన రాష్ట్ర ముఖ్యమంత్రి పరువు, మన రాష్ట్ర పరువు తియ్యటానికి, ఈ బీహార్ గ్యాంగ్ చేత, లోటస్ పాండ్ జగత్(న్) కంత్రీ వేషాలు వేస్తున్నాడు... వేషాలు అయితే వేస్తున్నాడు కాని, ఎప్పటి లాగే, సెల్ఫ్ గోల్ వేస్తూ, దొరికిపోయాడు...
తాజాగా ఈ బీహార్ పీకే గ్యాంగ్ కడప లాడ్డిలో హల్చల్ చేసింది... వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పాదయత్రలో అన్నీ తామై నడిపిస్తున్నారు.. కడప లాడ్డిలో నెల రోజులుగా మకాం వేశారు. కానీ బిలు కట్టకుండానే గదులు ఖాళీ చేయాలని చూశారు. నిలదీసిన లాడ్డి యాజమాన్యం పై విరుచుకుపడినట్లు తెలిసింది. అప్పటికీ లాడ్డి యాజమాని వినకపోవటంతో, పులివెందుల రౌడీలు రంగంలికి దిగారు... విశ్వసనీయ సమాచారం మేరకు, వైసీపీ తరపున సర్వేకు, పాదయాత్ర పర్యవేక్షణకు పీకే పంపిన 15 మంది సభ్యుల బృందం కడప రైల్వే స్టేషన్ రోడ్డులోని ఓ ప్రముఖ లాడ్డిలో నెల రోజుల క్రితం ఐదారు రూములు తీసుకున్నారు.
వీరు రోజూ ఉదయాన్నే లాడ్డి నుంచి బయటకు వెళ్లి రాత్రి పాదయాత్ర ముగిశాక వచ్చేవారు. వీరికి వసతితో పాటు భోజన ఏర్పాట్ల బాధ్యత కూడా లాడ్డి యాజమాన్యానిదే. రాత్రి పూట మద్యం అదనం... లక్షల రూపాయల్లో బిల్లు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సోమవారంతో జగన్ పాదయాత్ర కడ జిల్లాలో ముగియనుండడంతో ఉదయం పీకే బృందం బ్యాగులు సర్దుకుని, బిల్లు చెల్లించకుండా గదులు ఖాళీ చేసేందుకు ప్రయత్నించింది. బిల్లు కట్టి వెళ్ళాలని యాజమాన్యం పటుబట్టింది. "మమ్మల్నే బిల్లు అడుగుతారా.. కట్టాల్సినవారే కడతారు" అని వారి పై పీకే బృందం చిందులేసి గొడవకు దిగినట్లు ప్రచారం జరుగుతోంది. కొద్దిసేపటి తరువాత "ఇతరుల" జోక్యంతో వివాదం సదుమణిగినట్లు కూడా తెలుస్తోంది.