అక్క ఆరాటమే గాని బావ బ్రతకడు అనే సామెత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షానికి నూటికి నూరు పాళ్ళు వర్తిస్తుంది. అధికారంలోకి వస్తాం అంటూనే ప్రశాంత్ ని తెచ్చిపెట్టుకున్న వైకాపా పరిస్థితి రోజు రోజుకి దిగ జారుతుందని ఆ పార్టీ గ్రామ స్థాయి కమిటీలు ప్రస్తుత శాశన సభ్యులకు నియోజకవర్గ ఇంచార్జుల ముందు రోజుకి ఒక్కసారైనా వాపోతున్నారట. ఇదే విషయాన్ని జగన్ వద్దకు తీసుకు వెళ్లినా ప్రశాంత్ సలహాలను మాత్రమే పరిగణలోకి తీసుకునే జగన్ సమస్యపై మాత్రం ఇసుమంతైనా దృష్టి పెట్టట్లేదని సమాచారం.
నంద్యాల ఉప ఎన్నికకుగాను ప్రశాంత్ సలహాలను పాటించిన జగన్ అధికార పార్టీ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అలాగే ఆ పార్టీ మహిళా అధ్యక్షురాలు రోజా కూడా జగన్ ఆదేశాలతో తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వీరిద్దరూ చేసిన కామెంట్లు ఒక్క నంద్యాల ఓటర్లనే కాక రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్టీపై ప్రజల్లో చులకన భావం తెప్పించింది. అదే విధంగా ఇటీవల రాజశేఖర్ రెడ్డి వర్ధంతి రోజున కూడా చంద్రబాబు ఫై జగన్ చేసిన విమర్శలు ఆ పార్టీ ప్రతిష్టను మసక బార్చాయి.
అలాగే రాజధాని విషయంలో జగన్ వ్యవహార శైలి కూడా వివాదాస్పదంగా మారింది. అదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రజలు పవన్ పని తీరుని జగన్ పని తీరుని బేరీజు వేస్తూ ఆలోచనలో ఉన్నారట... పవన్ తరహాలో జగన్ ప్రజాసమస్యలను ఎంచుకుని పోరాటం చేసిన దాఖలాలు ఈ మూడేళ్ళలో ఎక్కడా దర్శనమివ్వలేదు. సమస్య ఉంది అని ఎప్పుడు ముఖ్యమంత్రిని కలిసి వివరించిన సందర్భము లేదు... వీటిని అన్ని పరిశీలించిన ప్రశాంత్ కిషోర్ జగన్ గెలవడం అనేది ఒక కలేనని వచ్చే జగన్ వద్ద స్పష్టం చేశారట... అయితే జగన్ మాత్రం గెలుస్తాననే ధీమాతో ఉంటూ ప్రశాంత్ కి చికాకు తెప్పిస్తున్నారట.