తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో జనసేనాని పవన్ కల్యాణ్ చర్చలు జరిపారు. తొలుత కేటీఆర్, పవన్ చర్చలు జరపగా.. ఆ తర్వాత 15 నిమిషాలపాటు కేసీఆర్ చర్చించారు. ఈ చర్చలు జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి వారి పక్క సీట్లోనే కూర్చుని ఉండడం గమనార్హం. కేసీఆర్, కేటీఆర్‌తో భేటీ తర్వాత గవర్నర్ నరసింహన్ కూడా పవన్ కల్యాణ్‌ను పక్కకు తీసుకెళ్లి మాట్లాడారు. రాజ్‌భవన్లో శనివారం రాత్రి జరిగిన ఎట్ హోంలో ఈ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా దాదాపు గంటపాటు ఎట్‌హోమ్ జరిగింది. సీఎం కేసీఆర్, గవర్నర్ రావడానికి ముందే అక్కడికి పవన్, కేటీఆర్ చేరుకున్నారు. తొలుత కేటీఆర్ ఆయనను ఆలింగనం చేసుకుని, పక్కన కూర్చోబెట్టుకుని ఏపీ రాజకీయాలపై మాట్లాడారు.
ఆ తర్వాత సీఎం కేసీఆర్ రాగానే ఆయనతోనూ కాసేపు పవన్ చర్చలు జరిపారు. ఏపీ రాజకీయాలతో పాటు, ఫెడరల్ ఫ్రంట్ గురించి కేసీఆర్ ప్రస్తావించినట్లు తెలిసింది. ఫ్రంట్ ఉద్దేశాన్ని వివరించారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పార్టీల బలాబలాలపై తన వద్ద ఉన్న సమాచారాన్ని కేసీఆర్ పవన్‌తో పంచుకున్నారని సమాచారం. ఇప్పటికే పవన్ నా ఫెడరల్ ఫ్రంట్ లో చేరాడు, నువ్వు కూడా చేరాలి అంటూ పవన్ ను కేసీఆర్ కోరినట్టు సమాచారం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా, ఏపీ రాజకీయాల్లోనూ వేలు పెడతామని, చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని కేసీఆర్, కేటీఆర్ వ్యాఖ్యానించారు కూడా.
అనంతరం, వైసీపీ అధినేత జగన్‌తో ఇటీవల కేటీఆర్ భేటీ అయి చర్చించారు. కేసీఆర్ కూడా ఫోన్లో మాట్లాడారు. ఫెడరల్ ఫ్రంట్‌లోకి రావాలని ఆహ్వానించారు. ఆ రెండు పార్టీల మధ్య ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలోనే, కేటీఆర్, కేసీఆర్, పవన్ చర్చలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. ఫెడరల్ ఫ్రంట్, ఏపీ రాజకీయాలు, పై వారి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. మొత్తానికి చంద్రబాబుని టార్గెట్ చేసే ఒక వర్గం అంతా హైదరాబాద్ లో సమావేశం అయ్యింది. ఇక్కడ జగన్ మోహన్ రెడ్డి ఒక్కరే మిస్సింగ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పై, ఏపి సియం పై ఎలాంటి కుట్రలు పన్నారో, ఈ రోజు పవన్ కళ్యాణ్ గుంటూరులో జరిగే మీటింగ్ చూస్తే తెలిసిపోతుంది. దాదపుగా రెండు నెలల నుంచి చంద్రబాబు పై సైలెంట్ అయిన పవన్, ఈ రోజు గుంటూరు మీటింగ్ లో మళ్ళీ విరుచుకుపడతారా, లేదో చూద్దాం..