పవన్ కళ్యాణ్ యాత్ర అని మొదలు పెట్టి, దాదాపు 15 రోజులు అయ్యింది... ఈ 15 రోజుల్లో 5 సెలవలు తీసుకున్నారు... కార్యకర్తలతో మాట్లాడాలని ఒకసారి, బౌన్సర్లకు దెబ్బలు తగిలాయి కొత్త వారు రావాలి అని ఒకసారి, బౌన్సర్ లకు గాయలు తగ్గలేదు అని ఇంకో సారి, రిసార్ట్ దీక్ష అని ఒకసారి, ఇలా రకరకాల కారణాలతో సెలవు తీసుకున్నారు పవన్ కళ్యాణ్.. పవన్ కళ్యాణ్ చాలా ఫిట్ గా ఉన్నారని, బౌన్సర్ లు ఫిట్ గా లేని కారణంగానే, సెలవులు తీసుకోవాల్సి వస్తుందని, జనసేన వర్గాలు చెప్తున్నాయి... అయితే, చెప్పా పెట్టకుండా, నిన్న సెలవు తీసుకున్నారు పవన్... ఎందుకు సెలవు తీసుకొన్నారో, ఎవరికీ తెలీదు... ఈ రోజు కూడా సెలవు అని చెప్తున్నారు.. మళ్ళీ రేపటి నుంచి, యాత్ర కొనసాగుతుంది అని చెప్తున్నారు... ఈ రెండు రోజులుగా పవన్, ఎందుకు సెలవు తీసుకున్నారు అంటే వింత వాదన వినిపిస్తుంది.
రెండు రోజులుగా పవన్ అరకులోని ఒక రిసార్ట్ లో సేద తీరుతున్నారు.. విజయనగరం జిల్లా పర్యటన ముగించుకుని శనివారం రాత్రి అరకులోయ చేరుకున్న పవన్ కల్యాణ్ ఆదివారం పూర్తిగా రిసార్టుకే పరిమితం అయ్యారు. పద్మాపురం గార్డెన్స్ సమీపంలోని ఒక ప్రైవేటు రిసార్టులో బసచేసారు. పవన్‌ను కలవడానికి పాడేరుకి చెందిన కొంతమంది జనసేన కార్యకర్తలు, గాజువాక మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్యతోపాటు స్థానికులు ప్రయత్నించారు. కానీ ఎవ్వరినీ కలవలేదు. ఇంతకీ పవన్ ఎందుకు రెస్ట్ తీసుకున్నారు, ఏమన్నా ఆరోగ్యం బాగోలేదా అని మీడియా అడగగా, ఎబ్బే అదేమీ లేదు, ఆయన చాలా ఫిట్ గా ఉన్నారు అని జనసేన వర్గాలు చెప్పాయి...
మరి ఎందుకు దీక్ష ఆపి, రిసార్ట్ లో సేద తీరుతున్నారు అని అడగగా, ఒక వింత కారణం చెప్పారు... సీఎం చంద్రబాబు విజయనగరం జిల్లా ఎస్.కోట పర్యటన నేపథ్యంలో పవన్ టూర్ షెడ్యూల్‌ను మార్చుకున్నారని జనసేన వర్గాలు అంటున్నాయి.. అసలు చంద్రబాబు రూట్ మ్యాప్ కి, పవన్ రూట్ మ్యాప్ కి సంబంధం లేకపోయినా, ఇలా చంద్రబాబు పేరు చెప్పి, యాత్ర వాయిదా వేసి రెండు రోజుల పాటు రిసార్ట్ లో సేద తీరారు పవన్... అయితే, ఇక్కడ చెప్పిన కారణం మాత్రం వింతగా ఉంది.. పవన్ కు బాగోలేదనో, అస్వస్థతగా ఉండి రెస్ట్ తీసుకున్నారు అంటే, ఎవరికి ఇబ్బంది ? ఎవరాన్నా కాదంటారా ? ఎవరికి అయినా ఇబ్బందులు రావటం సహజం.. అలా నిజం చెప్పి రిసార్ట్ లో సేద తీరకుండా, ఇలా చంద్రబాబు మీద తొయ్యటం ఏంటో...