ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ, రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి... మొన్నటి దాక, తెలుగుదేశం పార్టీతో ఉన్న పవన్ కళ్యాణ్, నిన్న రాత్రి సడన్ గా ప్లేట్ మార్చేసారు... మోడీని ఒక్క మాట అనకుండా, ప్రత్యెక హోదా పై, విభజన అంశాల పై ఏమి చేస్తాడో చెప్పకుండా, కేవలం రాష్ట్రం కోసం కష్టపడుతున్న చంద్రబాబునే టార్గెట్ చేస్తూ, మూడు గంటలు ప్రసంగించారు... ఇప్పటికే ప్రజలకు మోడీని ఒక్క మాట అనకుండా, కేంద్రం పై ఎదురు తిరుగుతున్న చంద్రబాబుని ఎందుకు అంటున్నారో, పవన్ ఎజెండా ఏంటో అని అనుకుంటున్నారు...
ఇదే సందర్భంలో, మరో వార్త బయటకు వచ్చింది... వైసీపీ ఎంపీ వరప్రసాద్ కొన్ని ఆసక్తికర విషయాలు బయట పెట్టారు... జనసేన, జగన్ ఇద్దరూ కలిసి భవిష్యత్తు రాజకీయం చేస్తున్నారని చెప్పారు... ఈ రోజు ఉదయం ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ లో, ఈ విషయం చెప్పారు... తనని కొంత కాలం క్రిందట, పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి కలవాలని రమ్మన్నారని చెప్పారు.. పవన్ పిలుపు మేరకు, ఆయన్ను కలవటానికి వెళ్లనాని చెప్పారు... ఈ సందర్భంలోనే, పవన్ తనను కొన్ని ప్రశ్నలు అడిగారని, జగన్ నన్ను ఎందుకు టార్గెట్ చేస్తుంది అని పవన్ అడిగారని చెప్పారు వైసీపీ ఎంపీ వరప్రసాద్.
మీరు మా జగన్ ను విమర్శలు చేస్తున్నారు, అవినీతి పార్టీ అంటున్నారు, అందుకే మీ మీద విమర్శలు చేస్తున్నాం... పోలవరం సందర్శనాకు మేము వెళ్తున్నామని తెలిసి, మీరు ముందే వెళ్లి హై జాక్ చేస్తే మాకు కోపం రాదా అని అన్నానని వైసీపీ ఎంపీ వరప్రసాద్ చెప్పారు...మీరు ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడుతున్నారని, అందుకే మీ పై విమర్శలు అని చెప్పానని చెప్పారు... అయితే దీనికి స్పందించిన పవన్, తానూ తెలుగుదేశంతో ఎంత మాత్రం లేను అని, అవసరం అయిన సమయంలో జగన్ తో కలిసి, జగన్ కు మద్దతు ప్రకటిస్తానని పవన్ చెప్పారని చెప్పారు... ఎన్నికల తరువాత, ఏమైనా సీట్లు తక్కువ అయితే, తానకు ఉన్న ఎమ్మల్యేలతో, జగన్ కు మద్దతు ఇస్తానని పవన్ హామీ ఇచ్చారని చెప్పారు... ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలకోసం పోరాడుతున్న పవన్‌కల్యాణ్‌కు మద్దతిస్తామని వైసీపీ ఎంపీ వరప్రసాద్ పేర్కొన్నారు... ఇది విషయం, ఇంకా ఎన్ని చిత్రాలు చూడాలో...