అంతా అనుకున్నట్టే, ప్లాన్ ప్రకారం జరుగుతుంది. తెలంగాణా ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ లబ్ధి కోసం, పవన్, జగన్ ఆరాట పడుతున్న సంగతి తెలిసిందే. కాకపొతే, వ్యవహారాలు అన్నీ లోపల లోపల చేసుకుంటున్నారు. ఏది బయటకు చెప్పటం లేదు. రాజకీయాల్లో ఏదైనా ప్రజల ముందు చెయ్యాలి కాని, అన్నీ చాటు మాటు వ్యవహారాలు చేస్తూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, చంద్రబాబుని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా ఢిల్లీ నుంచి నడిపిస్తున్న స్క్రిప్ట్ అనేది అందరికీ తెలిసిందే. ఇక తెలంగాణా ఎన్నికల విషయానికి వద్దాం. తెలంగాణా ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు కోసం పవన్, జగన్ ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు.
ఈ క్రమంలోనే, పవన్ కళ్యాణ్ శుక్రవారం రాత్రి అర్ధాంతరంగా తూర్పు గోదావరి జిల్లా పర్యటన ముగించుకుని ముంబై వెళ్లారు. అదే సమయంలో ఎదో అవార్డుల కార్యక్రమంలో పాల్గునటానికి కేటీఆర్ కూడా ముంబై వెళ్లారు. వీరిద్దరి మధ్యా చర్చలు జరిగినట్టు తెలుస్తుంది. ప్రాధమిక సమాచారం ప్రకారం, తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న కొన్ని నియోజకవర్గాల్లో, పవన్ కళ్యాణ్ తన అభ్యర్ధులని నిలబెడతారాని, ఆంధ్రా ఓట్లు చీలిక కోసం, ఈ ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తుంది. ఈ రోజు కొంత మందికి బీఫారం లు కూడా పవన్ ఇస్తారని సమాచారం.
ఇదంతా కేటీఆర్ తో భేటీ తరువాతే, ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. హైదరబాద్ లో అయితే, మీడియా కంట పడతారు కాబట్టి, ఈ వ్యవహారం అంతా ముంబైలో జరిగినట్టు సమాచారం. అయితే పవన్ కళ్యాణ్ నిజంగా అభ్యర్ధులని నిలబెడతారా, లేక టీఆర్ఎస్ కు సంపూర్ణ మద్దతు ఇస్తారా అనేది చూడాల్సి ఉంది. అయితే ఈ విషయం పై ముంబై మిర్రర్ అసిస్టెంట్ ఎడిటర్ కూడా ట్వీట్ చేసారు "అనూహ్యంగా, జనసేన తెలంగాణా ఎన్నికల్లో పోటీకి వస్తుంది. నిన్న ముంబైలో జరిగిన బేటీ తరువాత ఈ నిర్ణయం తీసుకున్నారు" అంటూ ట్వీట్ చేసారు. అంటే కేటీఆర్ తో భేటీ నిజం అని ఈ ట్వీట్ ద్వారా తెలుస్తుంది. చూద్దాం పవన్ ఏమి చేస్తారో..