పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో కొంత మంది చేసిన ప్రచారం పై జనసేన పార్టీ సీరియస్ అయ్యింది. దీని పై కేసు పెట్టటానికి సిద్ధమైనట్టు ప్రకటించింది. వివరాల్లోకి వెళ్తే, నిన్న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా, పవన్ కళ్యాణ్ ఫాన్స్, హంగామా మాములుగా చెయ్యలేదు. సోషల్ మీడియాలో అయితే, రచ్చ రచ్చ చేసి వదిలి పెట్టారు. అయితే, పవన్ ఫాన్స్ హడావిడి చూసి, కొంత మంది పవన్ పై వ్యతిరేక ప్రచారం మొదలు పెట్టారు. జనసేన లెటర్ హెడ్ పై, పవన్ కళ్యాణ్ రాజకీయాలు ఆపెస్తున్నారని, ఇక నుంచి ఫుల్ టైం సినిమాల్లో నటిస్తున్నారు అంటూ, జనసేన పార్టీ లెటర్ హెడ్ పై, రాసినట్టు పెట్టి, దాన్ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా చూసారు. అయితే అది నిజం అనుకుని కొంత మంది పవన్ ఫాన్స్ తో పాటు, సామాన్య ప్రజలు కూడా దాన్ని వైరల్ చేసారు.
అయితే ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ, ఈ విషయం పై తీవ్రంగా స్పందించింది. పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు చ్సుఇ ఓర్వలేక, కొంత మంది పవన్ కళ్యాణ్ పేరిట ఒక తప్పుడు లేఖను సృష్టించి, వైరల్ చేసారని, ఆ లేఖ పచ్చి మోసాపూరితమైనదని, జనసేన పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇలాంటి అసత్య ప్రచారాలు ఎవరూ నమ్మవద్దని కోరింది. ఆ లేఖ తయారు చేసింది ఎవరో కనుక్కోమని పోలీసులకు చెప్పమని, లేఖను సర్క్యులేట్ చేస్తున్న వారి పై కేసు నమోదు చేసి, లీగల్ గా ప్రొసీడ్ అవుతమాని జనసేన పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. దీనికి సంబంధించి, పార్టీ లీగల్ సెల్ ఇప్పటికే పని ప్రారంభించిందని చెప్పింది. ఎన్నికలు ప్రజాస్వామ్యంలో ఒక భాగం మాత్రమే అని, కాని ప్రజా సేవ ఎప్పుడూ ఉంటుదని, పవన్ కళ్యాణ్ దాన్నే నమ్ముకున్నారని ఆ ప్రకటనలో తెలిపింది.
అయితే గత నెల రోజులుగా వైసిపీ పార్టీ, పవన్ టార్గెట్ గా నడుస్తుంది. ఇప్పటికే వైసిపీ సోషల్ మీడియా ఆఫిషియాల్ హేండిల్ ఒకటి, పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు పై తప్పుడు ప్రచారం చెయ్యటంతో, జనసేన పోలీస్ కేసు పెట్టటంతో, ఆ పెట్టిన పోస్టింగ్ ను వైసీపీ డెలీట్ చేసింది. మరో పక్క నిన్న పవన్ పుట్టిన రోజున కూడా, కొంత మంది "పావలా కళ్యాణ్" అంటూ ట్వీట్ లు చేసి, దాన్ని ట్రెండ్ అయ్యేలా చూసారు. ఒక పక్క పవన్ కళ్యాణ్ ఫాన్స్ అతి ప్రవర్తన, మరో పక్క ప్రత్యర్ధుల ట్రాప్ లో, జనసేన ఇట్టే పడిపోతుంది. తెలివిగా ఎదుర్కోవాల్సింది పోయి, అత్యుత్సాహంతో, పవన్ కి ఇబ్బందులు తెచ్చి పెడుతున్నారు. ఏది ఏమైనా, ఒక మనిషి పై తప్పుడు ప్రచారాలు చెయ్యటం మాత్రం, హేయమైన చర్య.