జనసేన పార్టీ ఒక్కో అడుగు ముందుకువేస్తోంది. పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ ఉత్తరాంధ్ర పర్యటన ముగిసేలోపు ఈ ప్రాంత నేతల్లో కొందరిని జనసేనలో కలుపుకొనేందుకు చేస్తున్న యత్నాలు ఫలితమిస్తున్నాయి. ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి ప్రారంభించిన పోరాట యాత్ర పక్కా రాజకీయ వ్యూహంతో సాగుతోంది. వాస్తవానికి పవన్‌కల్యాణ్ పర్యటించేది, ప్రజలను ఉద్దేశించి మాట్లాడేది తక్కువ సమయమే. మిగిలిన సమయం అంతా తన సహచర, అనుచర బృందంతో మంతనాలు సాగిస్తున్నారు. ఎవరో వచ్చి కలుస్తున్నారు. మంతనాలు జరుపుతున్నారు. అయితే ఇప్పటి వరకు, చెప్పుకోదగ్గ పేరు ఒక్కటి లేదు. ఊరు పేరు తెలియని వారు, లేకపోతే తెలుగుదేశం, వైసిపీ తీసుకోని వారు వచ్చి చేరుతున్నారు. వీరి వల్ల అసలు పవన్ కు ఉపయోగం ఏంటో, ఆయనకే తెలియాలి.
జనసేన పార్టీలో చేరుతున్న లిస్టు చూస్తే ఇలాగే ఉంది. తెలుగుదేశం నాయకుడు కోన తాతారావు, మాజీ కాంగ్రెస్ నాయకుడు బాలసతీశ్, కాంగ్రెస్ పార్టీకి చెందినబొలిశెట్టి సత్యనారాయణ, పీసీసీ కార్యదర్శి గుంటూరు నర్సింహమూర్తి, ఇలా అందరూ వేరే పార్టీల వారే ఉన్నారు. అయితే, వీరు కూడా అసలు ఎవరో, లోకల్ ప్రజలు కూడా మర్చిపోయారు. ఇలాంటి వారిని తీసుకుని పవన్ ఏమి సాధిస్తాడో మరి. కొత్త రాజకీయం అని చెప్పే పవన్, ఇలా వేరే పార్టీల వారిని తీసుకుని మరో ప్రజా రాజ్యం చెయ్యటం తప్ప ఏమి కనిపించటం లేదు. అయితే, ఈ రోజు మాత్రం, కొంచెం గుర్తింపు ఉన్న నేత దగ్గరకు వెళ్ళాడు పవన్. గుర్తింపు ఉన్నా, ఏ పార్టీ కూడా ఆ నేతను తీసుకోలేదు.
పవన్ కళ్యాణ్ ఈ రోజు దాడి వీరభద్రరావు ఇంటికి వెళ్లారు. దాడి వీరభద్రరావు చాలా కాలం తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, పోయిన ఎన్నికల్లో జగన్ పార్టీలో చేరారు. అక్కడ జగన్ మార్క్ ట్రీట్మెంట్ తట్టుకోలేక తల బాదుకుని, చంద్రబాబు వద్దకు రావటానికి ప్రయత్నం చేస్తే, ఈయన హోసే ఫుల్ బోర్డు పెట్టారు. దీంతో రిటైర్మెంట్ లైఫ్ ఎంజాయ్ చేస్తుంటే, పవన్ రాకతో, మళ్ళీ ఆక్టివ్ అవటానికి రెడీ అవుతున్నారు. జగన్ ని తట్టుకోలేదు, చంద్రబాబు రానివ్వడు, అందుకే పవన్ వెంట నడవటానికి రెడీ అయ్యారు. ఈ మధ్యాహ్నం అనకాపల్లిలోని దాడి నివాసానికి వెళ్లిన పవన్.. ఆయన ఇచ్చిన విందుకు హాజరయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై వీరిద్దరు చర్చించినట్టు సమాచారం. ఈ సందర్భంగా పవన్‌ను దాడి వీరభద్రరావు శాలువాతో ఘనంగా సన్మానించారు. మొత్తానికి, ఇలాంటి వారిని చేర్చుకుని, పవన్ కొత్త తరహా రాజకీయం ఏమి చేస్తాడో మరి. మధ్యతరగతి వారికి టికెట్ లు ఇస్తా అని ట్వీట్ చేసినంత ఈజీ కాదు రాజకీయం అంటే. ఇలాంటి అవుట్ డేటెడ్ రాజకీయ నాయకుల కోసం కొత్త పార్టీ పెట్టాడు అంటే, అది పవన్ దుస్థితి...