జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పట్టుమని పది రోజులు ప్రజల్లో ఉండటం చూసారా ? వస్తాడు, హడావిడి చేస్తాడు, వెళ్ళిపోతాడు.. రంజాన్ సెలవలు, వినాయక చవతి సెలవలు, వర్షాలు, కాలు బెనికింది, కన్ను మీద కురుపు వచ్చింది, ఇలా వంకలు పెట్టి, ఫార్మ్ హౌస్ కి వెళ్ళిపోతాడు. తూర్పు గోదావరిలో నాలుగు రోజులు తిరిగి, ఫార్మ్ హౌస్ కి వెళ్ళిపోయి, దాదాపు నెల పైన అవుతుంది. మధ్యలో కొన్ని పార్టీ మీటింగ్లు పెట్టుకున్నారు, ఒక కుల కలెక్షన్ మీటింగ్ పెట్టుకున్నారు. ఇంత హిస్టరీ ఉన్న పవన్ కళ్యాణ్, సెంటర్ కి వెళ్ళిపోతున్నాడు అంట.. ఇప్పటికే ఏర్పాట్లు జరిగిపోతున్నాయి అంట.. తెలంగాణాలో బ్రతుకుతూ, తెలంగాణాలో ఎన్నికలు జరుగుతుంటే స్పందించిన వాడు, జాతీయ రాజకీయలు చేస్తాడు అంట..
"మనం జాతీయ రాజకీయాల్లోకి వెళుతున్నామ్.. దానికి సంబందించిన పనులు జరుగుతున్నాయ్" అంటూ పవన్, తన కులపు వాళ్ళని పిలిచి, కలెక్షన్ మీటింగ్ పెట్టి, ఆ మీటింగ్ లో చెప్పిన వ్యాఖ్యలను జర్నలిస్ట్ మూర్తి చెప్పారు. పవన్ కళ్యాణ్ సీక్రెట్ మీటింగ్ పెట్టి, డబ్బులు వసూలు చేస్తున్నాడు అంటూ, మహా న్యూస్ లో ఉండగా, మూర్తి ఒక స్పెషల్ ప్రోగ్రాం వేసి, వీడియోలు చూపించిన సంగతి తెలిసిందే. అందులో, పవన్ ఆడిటర్ మాట్లాడుతూ, చెక్ ఇస్తున్నారా, కాష్ ఇస్తున్నారా ? మినిమం 10 లక్షలు ఇవ్వాలి అని చెప్పిన వీడియో అందరూ చూసారు. అయితే, పవన్ నుంచి వచ్చిన ఒత్తిడితో, ఈ ప్రోగ్రాం మధ్యలోనే ఆపేశారు. పవన్ కళ్యాణ్, తన కులం వారితో, మాట్లాడిన మాటల వీడియో ప్లే చెయ్యలేదు.
దీంతో మనస్తాపం చెందిన మూర్తి, మహా న్యూస్ కి రాజీనామా చేసి వెళ్ళిపోయారు. ఈ తరుణంలో, పవన్ ఫాన్స్ గత రెండు రోజుల నుంచి, ఆయన పై చేస్తున్న ఉన్మాదం తట్టుకోలేక, ఒక యుట్యూబ్ వీడియో విడుదల చేసారు. అందులో, పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల గురించి చెప్పారు. కాపులతో మాత్రమే పవన్ కల్యాణ్ సమావేశమయ్యారని,అందులో పాల్గొన్న ఓ వ్యక్తి మాటలను కూడా వీడియోలో, ప్రజెంట్ చేశారు మూర్తి. అంతటితో ఆగిపోలేదు, తన దగ్గర జనసేనకు చెందిన నిఖార్సైన నిజాలు చాలా ఉన్నాయని, కానీ సందర్భంగా కాదని మాత్రమే బయటపెట్టడం లేదని తేల్చి చెప్పారు. తను బయపెట్టిన అంశంపైన కానీ, తన పై జనసేన కార్యకర్తలు చేస్తున్న ఆరోపణలపైన కానీ చర్చకు తాను సిద్ధమని సవాల్ చేశారు. అవసరం అయితే పవన్ 99 ఛానెల్ కు వచ్చి, చర్చిస్తానని చెప్పారు. ఇది ఇలా ఉంటే, నేను జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నా, నాకు సపోర్ట్ ఉంది, ఏర్పాట్లు జరుగుతున్నాయి అంటూ పవన్ చెప్పిన వ్యాఖ్యలు చూస్తుంటే, అన్న చిరంజీవి కాంగ్రెస్ కి పార్టీ అమ్మేసినట్టు, పవన్ తన పార్టీని బీజేపీకి అమ్మేస్తున్నారా అనే సందేహాలు కలుగుతున్నాయి.