నాలుగు రోజులు యాత్ర అన్నాడు.. రెండు రోజులు రిసార్ట్ లో ఉన్నాడు.. తరువాత హైదరాబాద్ వెళ్ళిపోయాడు... అదేమంటే బౌన్సర్ లు పండగ చేసుకోవాలి అన్నాడు.. పండగ అయిపోయిన 4 రోజులకు బయటకు వచ్చాడు.. కుంబకర్ణుడు నిద్ర లేగిసినట్టు, ఎప్పుడో అయిపోయిన విషయాలు, నెల రోజుల క్రిందట రమణ దీక్షితులు మాట్లాడిన మాటలు, మళ్ళీ ఇప్పుడు ట్వీట్ చేస్తున్నాడు.. అయినా వాటికి, డాక్యుమెంట్ లతో సహా, అప్పటి ఈఓలు, ఐఏఎస్ ఆఫీసర్లు, అక్కడ పై స్థాయిలో పని చేసిన వారు, అందరూ ఖండించారు. ఈ విషయం వచ్చినప్పుడు, పవన్ అప్పుడు యాత్ర అంటూ ప్రజల మధ్యలోనే ఉన్నాడు. ఈ విషయం మాత్రం, అప్పుడు మాట్లడలేదు. ఏమైందో ఏమో, ఎవరు చెప్పారో ఏమో కాని, రంజాన్ సెలవలు అయిపోయినాక, ఈ విషయం అందుకున్నాడు. సరే, ఇది కూడా తప్పు లేదు. ఆయన ప్రతిపక్ష పార్టీలో ఉన్నాడు కాబట్టి, ప్రభుత్వాన్ని ఇరికించే ఒక అవకాసం వాడుకుంటున్నాడు అనుకుందాం...
కాని ఇదే సమయంలో ఒక్కటి అంటే ఒక్క ట్వీట్ కేంద్రం పై కాని, మోడీ పై కాని లేదు. 22 ట్వీట్లతో చంద్రబాబుని తిట్టాడు కాని, ఒక్కటి అంటే ఒక్కటి మోడీ పై లేదు.. పైగా ఇప్పుడు రాష్ట్రంలో బర్నింగ్ టాపిక్ కడప స్టీల్ ప్లాంట్ పెట్టను అని కేంద్రం చెప్పటం, మరో పక్క రైల్వే జోన్ విషయంలో, పరిశీలించమని ఉంది, మేము పరిశీలిస్తూనే ఉంటాం అని పియూష్ గోయల్ చెప్పటం. దీని పై రాష్ట్రం అంతా గగ్గోలు పెడుతుంది. అయినా పవన్ కళ్యాణ్ కు చీమ కుట్టినట్టు కూడా లేదు... ఒక్కటంటే ఒక్క ట్వీట్, స్టీల్ ప్లాంట్ పై కాని, రైల్వే జోన్ పై కాని, మిగతా విభజన హామీల పై కాని లేదు... ఇలాంటివి చేస్తేనే, ఈయన బీజేపీకి లొంగిపోయాడు అని, బీజేపీ ఆడిస్తుంది అనే ప్రచారానికి మరింత ఊతం ఇచ్చేది.
నిజానికి ఈ ఏడాది జనవరి 6న మెకాన్ సంస్థ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ కడపకు వచ్చి, ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయబోయే ప్రాంతాన్ని పరిశీలించింది. 7,8 తేదీల్లో పరిశ్రమ ఏర్పాటుకు సంబంధించి అవసరమైన భూమి, విద్యుత్, నీరు, రవాణా ఇలా అన్ని రకాల రాయితీలు కల్పిస్తామని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం హామీ కూడా ఇచ్చింది. అంతకుముందే 2017 డిసెంబరు 27న జరిగిన చివరి సమావేశంలో మెకాన్ సంస్థ ఇచ్చిన సాధ్యాసాధ్యాల ప్రాథమిక నివేదికలో అనంతపురం జిల్లాలో లభ్యమయ్యే 110 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజ నిక్షేపాలు ఉక్కు పరిశ్రమను 15 ఏళ్ల నుంచి 20 ఏళ్ల పాటు నిర్వహించేందుకు సరిపోతాయని చెప్పడం జరిగింది. అంటే కమిటీ నివేదిక సానుకూలమన్నట్టే కదా. దీనికి బలం చేకూరుస్తూ మార్చి 15న పార్లమెంటులోని తన కార్యాలయంలో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు నిర్వహించిన సమావేశంలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి బీరేంద్రసింగ్ మాట్లాడుతూ.. మెకాన్ సంస్థ నివేదిక ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు సానుకూలంగా ఉన్నట్లు వెల్లడించారు. మరి ఉన్నట్టుండి ఇప్పుడు ఏమైంది? ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేసే అవకాశం ఉన్నా, లాభదాయకం కాదంటూ సుప్రీం కోర్టులో కేంద్ర ప్రభుత్వం నివేదిక ఎందుకు ఇచ్చింది? అసలు నివేదికలోని అంశాలను ఎందుకు బయటపెట్టరు? ఎందుకు కేంద్రం కడప ఉక్కును నాన్చుతుంది? ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ విషయం పై కేంద్రాన్ని నిలదీస్తుంటే, పవన్ మాత్రం, ఒక్కటంటే ఒక్క మాట మోడీని అనకపోగా, చంద్రబాబు పై మాత్రం, విరుచుకుపడుతున్నాడు.