ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన అసెంబ్లీలో వైసిపీ మాట్లాడిన బూతులు పైన ఎంత చర్చ జరిగిందో తెలిసిందే. దీని పైన పవన్ కళ్యాణ్ మొదటి సారి స్పందించారు. ఆయన ఈ రోజు మంగళగిరి పార్టీ ఆఫీస్ లో విశాఖ ఉక్క కోసం ఒక రోజు దీక్ష చేసారు. ముగింపు సందర్భంగా అయన మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు పైన, అసెంబ్లీలో వైసీపీ వ్యవహరించిన తీరు పైన పవన్ కళ్యాణ్ స్పందించారు. పవన్ మాటలలోనే "ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలు క్షీణించాయి. ఉత్తర ప్రదేశ్, బీహార్ లో లా అండ్ ఆర్డర్ చాలా అధ్వానంగా ఉందని చెప్పుకుంటాం. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వాటి అన్నిటికీ మించి పోయింది. ఎమ్మల్యేలే రౌడీజం చేసే స్థాయికి వచ్చింది. మొన్న చట్ట సభల్లో ఒక మాజీ ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా తిట్టారని వారు బాధపడ్డారని వార్తలు వస్తే, బాధ అనిపించింది. చట్ట సభలు అనేది ఒక శాసనాలు చేసే చోటు. అక్కడ బూతులు మాట్లాడుతున్నారు. బుతులే శాసనాలు అయ్యాయి. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని, వచ్చిన వార్తలు ప్రకారం, మన ప్రతిపక్ష నేతని, ఆయన భార్యని మీరు ఆ స్థాయిలో తిడితే, రోడ్డు మీద ఒక ఆడ బిడ్డకు మీరు ఏమి రక్షణ ఇస్తారు ? ప్రజా ప్రతినిధులు ఈ స్థాయికి దిగజారితే, ఆడ బిడ్డలకు రక్షణ ఏది ?రేపు రేపులు చేసే వారికి, మీ మాటలు ఎంత ప్రోత్సాహం కలిగించి ఉంటుందో మీరు అర్ధం చేసుకోండి."
"మీ ఇంట్లో వాళ్ళకు తెలుస్తుంది నేను చెప్పే మాటలు, మీకు అర్ధం అవుతుందో లేదో మరి. లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఉండాలి అనేది ఇందుకే. " అని పవన్ కళ్యాణ్ అన్నారు. పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా వైసీపీ పైన విరుచుకు పడ్డారు "స్టీల్ ప్లాంట్ కార్మికులు, భూ నిర్వాసితులకు నా సంఘీభావం – సమస్యలు, కష్టాలు వచ్చినప్పుడే జనసేన గుర్తుకువస్తోంది – ఓట్లు వేసేటప్పుడు కూడా జనసేన గుర్తుకురావాలని కోరుతున్నా – పని చేసే క్రమంలో పదవి రావాలి, పదవి కోసం పని చేయొద్దు – ప్రజల సంక్షేమం కోరుకునే వాడిని కాబట్టే పదవి లేకపోయినా పోరాటం చేస్తున్నా – వైసీపీ నేతలు జనసేనకు శత్రువులు కాదు, వారి విధానాలతో మాత్రమే వ్యతిరేకం – సమస్యపై ప్రశ్నిస్తే వైసీపీ నేతలు మాత్రం వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు – వ్యక్తిగత, కుటుంబ దూషణలు జనసేన ఎప్పుడూ చేయదు – స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో 150 మందికిపైగా చనిపోయారు – అభివృద్ధిలో కీలకమైన స్టీల్ ఉత్పత్తిలో మనం రెండో స్థానంలో ఉన్నాం – 67 మంది ఎమ్మెల్యేలు, ఏడుగురు ఎంపీలు స్టీల్ ప్లాంట్ కోసం పోరాడారు – ఎంతోమంది ప్రాణత్యాగాలతో విశాఖకు స్టీల్ ప్లాంట్ వచ్చింది - ప్రధాని మోదీతో గొడవ పెట్టుకోవాలని వైసీపీ నేతలు అంటున్నారు – అమరావతిని రాజధానిగా గుర్తిస్తామని అమిత్ షా నాతో అన్నారు – విలువలు లేని వైసీపీకి రాజ్యాంగం విలువ తెలియదు - జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకమాట, అధికారంలోకి వచ్చాక మరోమాట మాట్లాడారు"