ప్రకాశం జిల్లా మార్కాపురంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై మరోసారి విమర్శలు గుప్పించారు. జగన్ తనను పదే పదే యాక్టర్ అనడం పట్ల పవన్ ఘాటైన బదులిచ్చారు. ‘జగన్ మోహన్ రెడ్డి నన్ను యాక్టర్ అని సంబోధిస్తున్నారు. ఒప్పుకుంటా.. నేను నటుణ్నే, అది నా వృత్తి. మీరు ఏడాదిన్నర జైల్లో ఉండి వచ్చారు కదా. మిమ్మల్ని ఏమని పిలవాలి మరి?’ అని పవన్ ప్రశ్నించారు. మీరు మహాత్మా గాంధీనా లేదంటే పూల సుబ్బయ్య గారా? అని నిలదీశారు. జగన్ తనను టీడీపీ పార్టనర్ అనడం పట్ల పవన్ మండిపడ్డారు. జగన్ మిమ్మల్ని ఎవరి పార్టర్నర్ అని పిలవాలి? టీఆర్ఎస్ పార్టనర్ అని పిలవాలా? అమిత్ షా పార్టనర్ అని పిలవాలా? మోదీ పార్టనర్ అని పిలవాలా? అని జనసేనాని ప్రశ్నించారు.

pk 2803019

నేను యాక్టర్‌నే కానీ సినిమాలను వదిలేసి రాజకీయాల్లోకి వచ్చానన్నారు. ఈ తరానికి అండగా ఉండటానికి వచ్చాను. ప్రకాశం జిల్లాకు మాటిస్తున్నా.. ఇక్కడే నేను ఓనమాలు నేర్చుకున్నా. నేలతల్లి మీద ఒట్టేసి చెబుతున్నా.. నేను మీకు అండగా ఉంటానని పవన్ ఉద్వేగంగా మాట్లాడారు. జనం కోసమే తిట్లు పడుతున్నానని పవన్ తెలిపారు. జనసేన తెదేపా భాగస్వామేనంటూ వైకాపా అధినేత జగన్‌ చేసిన వ్యాఖ్యలపై పవన్‌ కల్యాణ్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. దొంగపొత్తులు పెట్టుకోవాల్సిన అవసరం జనసేనకు లేదని తేల్చి చెప్పారు. తల తెగిపడినా జగన్‌లా మోదీ, అమిత్‌షాల ముందు మోకరిల్లబోమని స్పష్టంచేశారు.

pk 2803019

ప్రకాశం జిల్లా గిద్దలూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ.. యాక్టింగ్‌ వదిలేసి పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వచ్చానన్నారు. సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన తనను యాక్టర్‌ అని జగన్‌ పిలిస్తే.. మరి జైలులో ఉండి వచ్చిన ఆయనను ఎలా పిలవాలని ప్రశ్నించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రకాశం జిల్లాకు వెనుకబడిన నిధులు ఇవ్వని కేంద్రం వద్ద తన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టబోనన్నారు. తెరాస, భాజపాలతో పొత్తులపై బహిరంగంగా చెప్పాలని వైకాపాను పవన్‌ డిమాండ్‌ చేశారు. పోటీ పరీక్షలకు వెళ్లే విద్యార్థులకు కోచింగ్‌ సెంటర్‌లను ఏర్పాటు చేస్తామని పవన్‌ హామీ ఇచ్చారు. ప్రకాశం జిల్లాను ఎవరూ చేయని రీతిలో అభివృద్ధిచేస్తామన్నారు. ప్రతి కుటుంబానికి రూ.10లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తామని భరోసా ఇచ్చారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read