జగన్ మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ మధ్య వ్యక్తిగత ఆరోపణల స్థాయి, రోజు రోజుకీ పెరిగిపోతుంది. గతంలో జగన్ మోహన్ రెడ్డి, పవన్ ని ఉద్దేశిస్తూ, నలుగురు నలుగురు పెళ్ళాలు, అయిదుగురు పిల్లలు అంటూ, పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత ఆరోపణలు చేసారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వంతు. జగన్ మోహన్ రెడ్డి, మతం, కులం పై, వ్యాఖ్యలు చేసి, రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించారు. పవన్ చేసిన వ్యాఖ్యలు, ఇప్పుడు సంచలనంగా మారాయి. ఈ వ్యాఖ్యల పై, వైసీపీ నుంచి మరింత ఎదురు దాడి జరిగే అవకాశం ఉంది. పవన్ మాట్లాడుతూ, జగన మాతం మారారు అని, అయినా కులాన్ని మాత్రం వదలటం లేదని అన్నారు. మతం మార్చుకుంటే, ఇంకా కులం ఎందుకు, దాన్ని పట్టుకుని ఎందుకు వేలాడుతున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఒకవేళ, జగన్ క్రీస్టియన్ మతం తీసుకుంది నిజమే అయితే, ఏసులో ఉన్న సహనం, క్షమ గుణాలు, రావాలని, కాని, జగన్ మోహన్ రెడ్డికి, అవి రెండూ లేవని పవన్ కళ్యాణ్ అన్నారు.
రుపతి పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఓట్ల కోసం, జగన్ కులం, మతం వాడుకుంటున్నారని, కులం కావాలంటే కులం తీస్తారని, మతం ఓట్లు కావాలంటే, మతం వాడతారని, పవన్ కళ్యాణ్ అన్నారు. సిమెంట్ ఫ్యాక్టరీలు, మీడియా కంపెనీలు స్థాపించటానికి, రాజకీయాల్లోకి రాలేదని పవన్ కళ్యాణ్ అన్నారు. జగన్ రెడ్డిది రంగుల రాజ్యం అని, తిరుమల ఏడుకొండలు మినహా, రాష్ట్రం అంతటా రంగులతో నింపేసారని పవన్ కళ్యాణ్ అన్నారు. ఏపిలో కూడా ఆడ బిడ్డల పై, ఎన్నో ఆకృత్యాలు జరుగుతున్నాయని, ఆడబిడ్డలను రక్షించుకోలేక పొతే, 151 సీట్లు ఇచ్చి, ఉపయోగం ఏమిటి అంటూ, వైసీపీ ప్రభుత్వాన్ని, పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.
అయితే ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి కూడా, తన పై వస్తున్న కులం, మతం వ్యాఖ్యల పై స్పందించారు. ఈ మధ్య కొంత మంది, నా కులాన్ని, మతాన్ని కూడా రాజకీయాల్లోకి లాగుతున్నారని, అయితే నా మతం 'మానవత్వం '.. నా కులం 'మాట నిలబెట్టుకునే' కులం అంటూ, వ్యాఖ్యానించారు. ఈ మధ్య కాలంలో తిరుమల పవిత్రతకు జరుగుతున్న అపచారాల పై, అనేక వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ కోవలోనే, నిన్న కూడా, టిటిడి వెబ్సైటులో, శ్రీ ఏసయ్యా అనే పదం కనిపించింది. టిడిపి చైర్మెన్ వైవీ సుబ్బారెడ్డి మాత్రం, కావాలనే ఇలా చేస్తున్నారని, ప్రతిపక్షాల పై తోసేసారు. దీని పై పెద్ద ఎత్తున వార్తలు రావటం, అలాగే పవన్ కళ్యాణ్ పదే పదే జగన్ రెడ్డి అని సంబోధించటంతో, జగన్ కూడా స్పందించారు.