అమరావతి రైతుల సమస్యల పై ఈ రోజు జనసేన కార్యాలయంలో, పవన్ కళ్యాణ్ రైతులతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. జగన్ మోహన్ రెడ్డి గెలిచిన విధానం పై, పవన్ సంచలన వ్యాఖ్యలు చేసారు. కాల మహిమో, లేక ఈవీఎంల మహిమో, జగన మోహన్ రెడ్డి గెలిచారంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. జగన్ మొహన్ రెడ్డి గెలిపు పై, పవన్ ఇలా స్పందించటం పై, ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఎన్నికల ఫలితాలకు ముందు దేశంలోని 24 పార్టీలు, ఈవీఎంల ట్యాంపరింగ్ పై ఆందోళన చేసారు. జగన్ గెలిచిన సీట్లు చూసిన తరువాత, కొంత మంది ఈవీఎంల పై మాట్లాడినా, అది పెద్ద చర్చ ఏమి జరగలేదు. అయితే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు మాత్రం, పెద్ద చర్చకు తెర లేపాయి. జగన్ క్యాంప్ వైపు నుంచి పవన్ కు ఈ విషయంలో ఎలాంటి కౌంటర్ వస్తుందో చూడాలి.
ఇక అమరావతి పై పవన్ మాట్లాడుతూ " బొత్సా గారికి నా విన్నపం, ప్రజలు ఆగ్రహానికి గురయ్యే వార్తలు మీరు ఇచ్చి వారి ఆగ్రహానికి గురి కాకండి, మీరు అనుభవజ్ఞులు ఆలోచించి మాట్లాడండి. చెడు ప్రకటనలన్ని జగన్ గారు కానీ, ఆయన పక్కన ఉన్న దగ్గరి వారు కానీ ఇవ్వరు, ధ్వంసానికి సంబంధించినవి ఆయన కుటుంబ సభ్యులు కానీ, దగ్గరి వారు కానీ ఇవ్వరు, చెడు వార్తలు బొత్సా, అనిల్ యాదవ్ లాంటి వారు జగన్ మాయలో పడి ప్రకటన ఇచ్చి మాటలు పడతారు .151 ఎమ్మెల్యేల బలం ఉంది, ఏదైనా తప్పు జరిగితే సరిదిద్దండి, శిక్షించండి, అంతేకాని అమరావతి తరలిస్తాం అనే అవకతవక ప్రకటనలు మానండి. ఒకసారి కర్నూలు వదులుకుని హైదరాబాద్ వెళ్ళాం, ఇప్పుడు అది వదులుకుని అమరావతి వచ్చాం, ఇప్పుడు మళ్లీ వదులుకోవాలి అంటే ఇది రైతు సమస్య కాదు, రాష్ట్ర ప్రజల సమస్య"
"2014 లో వైసీపీ అధికారంలోకి వచ్చి ఉంటే వారు భూములు కొనుక్కున్న దొనకొండ ప్రాంతంలో రాజధాని వచ్చి ఉండేదేమో. రాజధాని అంశం వల్ల నాకు కష్టం తప్ప సుఖం ఏమి లేదు, నా వ్యక్తిగత లాభం ఏమీ లేదు,కానీ భావితరాల వారి భవిష్యత్తు ఇబ్బందుల్లో నెట్టేస్తున్నారు అని తెలిసి, అలా జరగకుండా ఉండటానికి ఇక్కడకు వచ్చాను. రైతు నాయకులు కలవగానే నేను సమస్యను ఆలస్యం చేయకుండా వెంటనే పర్యటనకు వచ్చాను, ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించాను, సమస్యలను తెలుసుకున్నాను. రైతులు భూములు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, వ్యక్తులకు కాదు, ప్రభుత్వం మాట తప్పి వెనక్కు వెళ్ళిపోతే మీకు అండగా పోరాటం చేయడానికి జనసేన ఉంది." అంటూ పవన్ కళ్యాణ్ చెప్పారు.