మనం మన హద్దుల్లో ఉంటే, హుందా రాజకీయం చేస్తే, ఎవడైనా హుందాగానే రియాక్ట్ అవుతారు. లేదు నేను ఎదుటి వాడిని పుల్ల పెట్టి కెలికి కెలికి పెడతాను, కాని నన్ను మాత్రం, ఎవరూ ఏమీ అనకూడదు, అనే వేషాలు ప్రజా జీవితంలో కుదరవు. మన వెనుక వంద బొక్కలు పెట్టుకుని, ఎదుటివాడిని కాలేలాగా రెచ్చగోడితే, మన బొక్కలు గురించే మాట్లాడతారు. ఎక్కడ వరకు ఆగాలో, అక్కడ ఆగితే, ఎవరికీ ఇబ్బంది ఉండదు. నేను ఏమైనా అంటాను, నన్ను మాత్రం ఎవరూ ఏమి అనకూడదు అంటే రాజకీయాల్లో అస్సలు కుదరదు. నిన్న జగన్ ఎలాంటి వ్యక్తిగత విమర్శలు చేసాడో చూసాం. అది తప్పు అని అందరూ ఖండించారు కూడా. మరి పవన్ కళ్యాణ్ కావాలని ఒక వర్గాన్ని మాటి మాటికి రెచ్చగొట్టే చర్యలు కూడా ఖండించాలి కదా..
నిన్న పవన్ కళ్యాణ్ ఆఫీస్ నుంచి ఒక ప్రెస్ నోట్ వచ్చింది. అది డైరెక్ట్ గా హిందూపురం ఎంపీ బాలకృష్ణ గురించి అనే విషయం అందరికీ తెలుస్తుంది. ఆ ప్రెస్ నోట్ ప్రకారం, పవన్ అభిమానులు, ఓ ర్యాలీలో బైక్ సైలెన్సర్లు తీసేసి భారీ రొద చేసిన విషయంలో పోలీసులు కేసు నమోదు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. జనసేన సైనికులు బైక్ సైలెన్సర్ తీసి శబ్దం చేస్తే అదేదో పెద్ద నేరం చేసినట్లు చూస్తున్నారని ఆరోపించిన ఆయన, ఇంట్లో తుపాకీతో కాల్చి బయట తిరుగుతున్న వాళ్లను మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. జన సైనికుల సంస్కారం చాలా గొప్పదని వ్యాఖ్యానించారు పవన్. అదే సమయంలో వ్యాపారాలు చేసే వాళ్ళు రాజకీయాల్లోకి పనికిరారు అంటూ, ఆ ప్రెస్ నోట్ లో ఉంది.
అందరూ జగన్ లాంటి వారు కాదు కాబట్టి, తెలుగుదేశం పార్టీ నాయకులు, పవన్ చేసిన వ్యాఖ్యల పై స్పందించలేదు. స్పందించి ఉంటే ఎంత రచ్చ అయ్యేది ? కులాల మధ్య గొడవలు దాకా వెళ్ళేది. పవన్ కళ్యాణ్ కులాల మధ్య గొడవలు పెట్టటానికి చుస్తున్నాడు, అతనికి స్పందించవద్దు అని ఆదేశాలు ఇవ్వటంతో, ఎవరూ పవన్ ని సీరియస్ గా తీసుకోవటం లేదు. అయితే, వ్యాపారాలు చేసే వాళ్ళు రాజకీయాల్లోకి రాకూడదు అనే పవన్, సినిమా అనేది వ్యాపారం కాదు సంఘ సేవ అని పవన్ ఉద్దేశమా ? మెగా ఫ్యామిలీ లో 9 మంది హీరో లు,5 గురు నిర్మాతలు చేసేది సంఘ సేవా ? ప్రజా రాజ్యం పార్టీ పెట్టి చేసింది వ్యాపారం కాదా ? పవన్ పార్టీలో కొత్తగా చేరుతున్న వారు వ్యాపారస్థులు కాదా ? ఎదుటి వాడికి చెప్పే సమయంలో, మన వెనుక ఏముందో చూసుకోకుండా, స్టేట్మెంట్ లు ఇస్తే, ప్రజలు గొర్రెల మంద అనుకుంటున్నారా ?