ప్రశాంత్ కిషోర్ తెలుసు కదా.. మన జగన్ మోహన్ రెడ్డి, తన సత్తా ఏంటో తెలిసి, చంద్రబాబుని డీ కొట్టటం నా వల్ల కాదని, కోట్లు ఖర్చు పెట్టి, తెచ్చుకున్న సలహాదారుడు... సోషల్ మీడియాని ఫేక్ చేసి పెట్టటంలో దిట్ట... ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు, కనికట్టు చేసే గారిడీ వాడు టైపు... అయితే ఎన్ని చేసినా, ఎంత మందిని తెచ్చుకున్నా, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా మనోడి రాత మారలేదు అనుకోండి, అది వేరే విషయం... అయితే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు కూడా, ఒక కొత్త సలహాదారుడు వచ్చాడు... ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి, ఇతన్ని తీసుకోచ్చారో కాని, కనీసం ఒక్క ముక్క కూడా తెలుగులో మాట్లాడ లేని ఇతను, జనసేన పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చి, నా సత్తా చూపిస్తా అంటూ, అప్పుడే ఛాలెంజ్ లు చేస్తున్నాడు...

pk dev 01052018

ఈ రోజు, హైదరాబాద్‌లో తమ పార్టీ ముఖ్య కార్యకర్తలతో జరిగిన సమావేశంలో, జనసేన పార్టీకి, రాజకీయ వ్యూహకర్తగా దేవ్‌ అనే వ్యక్తి పనిచేస్తాడు అంటూ పవన్ కళ్యాణ్ అతన్ని పరిచయం చేసారు.. గతంలో తను స్థాపించిన కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్‌‌కు సంబంధించిన 1200 మంది కార్యకర్తలు దేవ్ టీమ్‌కు సహకరిస్తారన్నారు. అయితే, అసలు ఈ దేవ్ అనే అతను ఎవరు ? ఎక్కడ నుంచి వచ్చాడు ? అతని ప్రొఫైల్ ఏంటి ? ఇలాంటి వివరాలు ఏమి తెలియవు... పేరు కూడా, కేవలం దేవ్ అని మాత్రమే చెప్పి, పూర్తి పేరు కూడా చెప్పకుండా , ఎందుకో మరి దాస్తున్నారు...

pk dev 01052018

ఈ సందర్భంగా దేవ్‌ తనను తాను పరిచయం చేసుకున్నారు. "జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వివిధ పార్టీలతో కలిసి పని చేసిన అనుభవం నాకు ఉంది. ఈ రంగంలో దశాబ్ద కాలంగా ఉన్నాను. గొప్ప దృక్పథం ఉన్న నాయకుడు పవన్ కల్యాణ్. ఎన్నికలప్పుడు వచ్చి ముఖం చూపించి వెళ్లిపోయేటటువంటి రాజకీయనాయకుడు కాదు. ఆయనకు ప్రజా సమస్యల పట్ల, సామాజిక అంశాల పట్ల స్పష్టమైన అవగాహన ఉంది. జనసేన పార్టీకి బలమైన భావజాలాల్ని, సిద్ధాంతాల్ని రూపొందించారు. అందుకు పటిష్టమైన వ్యూహాన్ని జోడిస్తే తప్పకుండా అధికారంలోకి వస్తాం. ఇందుకు బూత్‌స్థాయి నుంచి పకడ్బందీగా ప్రణాళికలు వేసుకోవాలి. నా టీమ్‌కు మీ అందరి సహకారం అవసరం. రాజకీయంగా పార్టీ నేతలు, కార్యకర్తలు అందరూ పవన్‌ కల్యాణ్‌ ఆలోచనలను, సిద్ధాంతాల్నీ ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలనే అంశాలతో పాటు ఎన్నికల వరకు అనుసరించాల్సిన వ్యూహాల్నీ మీతో ఎప్పటికప్పుడు పంచుకుంటాను. ప్రజలతో మమేకమయ్యే పార్టీ జనసేన.. ఈ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే ధ్యేయంగా పని చేద్దాం" అని అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read